Fire Accident: నాంపల్లి అగ్ని ప్రమాద ఘటన.. భవన యాజమాని అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nampally: ఈ నెల 13 వ తేదీన నాంపల్లి లోని బజార్‌ఘాట్ లోని బాలాజీ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగిన విషయం అందరికి తెలిసిందే.. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 10 కి చేరింది. కాగా గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో భవనం యజమానిని పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. వివరాలలోకి వెళ్తే.. బజార్‌ఘాట్ లోని బాలాజీ రెసిడెన్సీ యజమాని రమేష్ గత కొంత కాలంగా అక్రమంగా కెమికల్స్ ను విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో పలుసార్లు పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చిన తన పంథా మాత్రం మార్చుకోలేదు. నాలుగు అంతస్తుల భవనం లోని స్టిల్ట్ ఫ్లోర్‌లో కెమికల్ డ్రమ్ములు ఉంచాడు. ఈ నేపధ్యంలో దీపావళి రోజు చిన్న నిప్పురవ్వ తో మొదలైన మంటలు ఆ కెమికల్ డ్రమ్ములకు అంటుకోవడం వల్లనే ఈ ఘోరం జరిగింది. దీనితో రమేష్ ను నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
Read also:Priyanka Gandhi: కర్ణాటక గురించి మాట్లాడటం కాదు.. తెలంగాణలో ఏం చేశారు.. కేసీఆర్ పై ప్రియాంక ఫైర్
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
కాగా ఈ ఘటన గురించి పోలీసు అధికారి మాట్లాడుతూ.. నిందితుడు గతంలో చాల సార్లు రెసిన్ డ్రమ్ములు అలానే డబ్బాలను అక్రమంగా స్టిల్ట్‌లో నిల్వ చేస్తూ పట్టుబడ్డాడని.. ఎన్ని సార్లు చెప్పిన తన పంథా మార్చుకోలేదని.. ఇప్పుడు ఈ ప్రమాదానికి అతనే కారణమని పేర్కొన్నారు. నవంబర్ 11 సాయంత్రం నిందితుడు 35 కిలోల రెసిన్ ఉన్న 32 డబ్బాలను కొనుగోలు చేసాడని.. ఆ రెసిన్ కెమికల్ ఉన్న డబ్బాలను స్టిల్ట్ ఫ్లోర్‌లో నిల్వ చేసాడని.. కాగా నవంబర్ 13 వ తేదీన పిల్లలు బాణాసంచా కలుస్తున్న సమయంలో నిప్పురవ్వలు నిందితుడు ఉంచిన రెసిన్ డబ్బాలను తాకడం వల్ల మంటలు చెలరేగాయని పేర్కొన్నారు. దీనితో నిందితుడిని అరెస్ట్ చేసి ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 304 (II) 285 (అగ్ని లేదా మండే పదార్థాలకు సంబంధించి నిర్లక్ష్యంగా ప్రవర్తించడం), 286 (పేలుడు పదార్ధానికి సంబంధించి నిర్లక్ష్య ప్రవర్తన), సెక్షన్ 9B (1) (b) పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!