హైదరాబాద్ కూకట్ పల్లి ఖైతలాపూర్ గ్రౌండ్లో మెగాడ్రోన్ షో ఆదివారం జరిగింది. సీఎంఆర్ ఫ్యామిలీ, సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యూయలెరీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫ్యాషన్ షో, మెగా డ్రోన్ షో జరిగాయి.
హైదరాబాద్ లో బోనాలు ఎంత ఫేమస్సో.. హలీం కూడా అంతే ఫేమస్.. రంజాన్ నెల వచ్చిందంటే చాలు గల్లీకి ఒకటి హలీం స్టాల్ కనిపిస్తుంది.. ఆ రుచికి ఫిదా అవ్వని వాళ్లు ఉండరు.. ఇక రంజాన్ మాసం రావడానికి ఒక నెల మాత్రమే ఉంది.. అప్పుడు హలీం దొరకడం కాస్త కష్టమే.. ఈ సారి హలీమ్ డిమాండ్‌ను తీర్చడానికి హోటళ్లు సిద్ధమయ్యాయి.. ఇప్పటికే హైదరాబాద్ వీధులు సందడిగా మారాయి . అయితే ఈ సంవత్సరం వినియోగదారులకు హలీమ్…
హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో రాంజీ గోండు ట్రైబల్ మ్యూజియంకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా రామ్‌జీ గోండు పోరాడారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలు భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సి ఉందన్నారు.
వరకట్న వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని గాజులరామారంకి చెందిన అభిలాష్, అమరావతి దంపతులకు 2019లో వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ.4 కోట్లు కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. అర కేజీ బంగారం, 2 కేజీల వెండి వస్తువులు, రూ. 10 లక్షల నగదు, హయత్ నగర్లో రూ. 3 కోట్ల విలువ చేసే ఫ్లాటు కట్నం కింద ఇచ్చారు.
Coach Jai Simha React on His Suspension: హెడ్ కోచ్ జై సింహా తమ పట్ల అనుచితంగా ప్రవర్తించాడని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)కు మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. బస్సులో తమ ముందే మద్యం సేవించాడని, అడ్డు చెప్పినందుకు బండ బూతులు తిట్టాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో కోచ్ పదవి నుంచి జై సింహాను తక్షణమే తప్పిస్తూ హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ వేధింపుల ఆరోపణలపై కోచ్ జై సింహా…
మహిళా క్రికెట్ హెడ్ కోచ్ జై సింహాకు మద్దతుగా కొంత మంది ఉన్నారని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) సీనియర్ మెంబర్ బాబు రావ్ సాగర్ పేర్కొన్నారు. జై సింహాపై 2 నెలల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, అయినా ఇంటర్నల్ కమిటీలో కనీసం విచారణ కూడా జరపలేదన్నారు. జై సింహాను సస్పెండ్ చేస్తే సరిపోదని, కఠిన చర్యలు తీసుకోవాలని బాబు రావ్ సాగర్ కోరారు. కోచ్ జై సింహా తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని మహిళా క్రికెటర్లు…
HCA suspends Hyderabad Women Coach Jai Simha: హైదరాబాద్ మహిళా క్రికెటర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కోచ్ జై సింహాపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. కోచ్ పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలని హెచ్‌సీఏ ఆదేశించింది. జై సింహాను సస్పెండ్ చేస్తూ హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఆదేశాలు జారీ చేశారు. మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదని, క్రిమినల్ కేసులు పెడతాం అని తెలిపారు. ‘గత కొంతకాలంగా…
Hyderabad Coach misbehaves with Women Cricketers: హైదరాబాద్ మహిళా క్రికెటర్లతో కోచ్ అసభ్యంగా ప్రవర్తించిన తీరు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళా క్రికెటర్లను బస్సులో తీసుకెళ్తూ కోచ్ మద్యం తాగాడు. అంతేకాకుండా మద్యం సేవిస్తూనే.. మహిళా క్రికెటర్లతో అసభ్యంగా ప్రవర్థించాడు. ఇంత జరుగుతున్నా అడ్డుచెప్పకుండా.. ఆ కోచ్‌కు ఓ మహిళా సిబ్బంది మద్దతుగా నిలిచింది. ఈ ఘటనపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)కు మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేసినా.. ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. వివరాల…
KCR Birthday Celebrations:బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి 70వ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ సందర్భంగా.. ఈ నెల 17న ఆయన జన్మదిన వేడుకలను నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. తెలంగాణ భవన్లో కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు శుభవార్త అందించారు. కాగా.. 1000 మంది ఆటో డ్రైవర్లకు రూ.లక్ష చొప్పున మొత్తం రూ.10 కోట్ల రూపాయల విలువైన ప్రమాద, ఆరోగ్య…