కొడుకు చనిపోయిన విషయం తెలియక మూడు రోజుల పాటు అంధకారంలోనే ఉండిపోయారు అంధ తల్లిదండ్రులు. మనసును కలచివేసే ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని నాగోల్‌లో చోటుచేసుకుంది. కొడుకు మృతి నాగోల్‌లో అంధ తల్లిదండ్రులకు అంతులేని విషాదాన్ని మిగిల్చింది. కుమారుడు మృతి చెందిన విషయం తెలియని పరిస్థితిలో మూడు రోజుల పాటు తిండి, తిప్పలు లేక ఆ అంధ వృద్ధ దంపతులు అవస్థలు పడ్డారు.
టపాసుల దుకాణ దారులు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. అబిడ్స్ బొగ్గులకుంటలో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదానికి గురైన క్రాకర్స్ దుకాణ ప్రాంతాన్ని పరిశీలించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన క్రాకర్స్ దుకాణాన్ని ఆ పక్కనే ఆహుతి అయిన టిఫిన్ సెంటర్‌ను పరిశీలించి ప్రమాదానికి కారణాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు ఏవీ రంగనాథ్.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా గతంలో పనిచేసిన అమోయ్ కుమార్ పై రంగారెడ్డి జిల్లా వట్టినపులపల్లిలోని... శంకర్ హిల్స్ ప్లాట్స్ పర్చేజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. 1983లో రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టి నాగులపల్లిలోని 460 ఎకరాల్లో... 3,333 ప్లాట్లను కొనుగోలు చేశామని అసోసియేషన్ సభ్యులు లక్ష్మీ కుమారి, కృష్ణారెడ్డి లు తెలిపారు.
హైదరాబాద్ నగరంలో నెల రోజుల పాటు పోలీస్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు చేశారు. నగరంలో అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విశ్వసనీయ సమాచారం ఉందన్నారు.
హైదరాబాద్‌లోని నందినగర్‌లో విషాదం చోటుచేసుకుంది. నంది నగర్లో మోమోస్ తిని ఓ మహిళ మృతి చెందగా.. మరో 20 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తు్న్నారు. నందినగర్‌లో వారాంతపు సంతలో పెట్టిన మోమోస్‌ను బాధితులు తిన్నట్లు తెలిసింది.
హైదరాబాద్ శివార్లలో డ్రగ్స్ పార్టీపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. శని, ఆదివారాలు వచ్చాయంటే రేవ్ పార్టీలు అని విచ్చల విడిగా డ్రగ్స్ దందా జరుగుతోందన్నారు. విదేశీ మాదక ద్రవ్యాలతో పాటు, కొకైన్లు విచ్చల విడిగా తెచ్చి భాగ్య నగరంలో డ్రగ్స్ దందా చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
తమ ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకునేందుకు గాను లాజిస్టిక్స్(కార్గో) సేవలను టీజీఎస్ఆర్టీసీ మరింతగా విస్తరిస్తోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ తెలిపారు. అందులో భాగంగానే రాజధాని హైదరాబాద్ లో వేగవంతమైన సేవలను అందించేందుకు హోం డెలివరీ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది.. అనేక బస్తీలు, హైదరాబాద్ చుట్టుపక్కల కాలనీలలో ఓపెన్ డ్రైనేజీ ఉంది.. ఇంత వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
స్క్వాడ్రన్ లీడర్ జయసింహ నేతృత్వంలోని ఘనంగా ఇండియన్ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్, వైరల్‌పే ద్వారా స్పాన్సర్ చేయబడిన 15వ ఇండియన్ నేషనల్ మెమరీ ఛాంపియన్‌షిప్‌ను అక్టోబర్ 20, 2024న హైదరాబాద్‌లో విజయవంతంగా నిర్వహించింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో 3 దేశాలు, 13 రాష్ట్రాలు, 59 నగరాలు , 74 పాఠశాలల నుండి 180 మంది పాల్గొన్నారు.