Road Accident: హైదరాబాద్‌లోని షాపూర్ నగర్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వాహనదారుడిని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగంతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రాథమిక దర్యాప్తులో మృతుడు రాంకీ సంస్థలో పనిచేసే హరికృష్ణగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ఘటనాస్థలిలో ప్రమాదానికి కారణమైన బస్సుపై వాహనదారులు దాడి చేసి అద్దాలను పగలగొట్టారు. ఉదయం రోడ్లపై పని చేస్తున్న మున్సిపల్ కార్మికులు, స్థానికులు రోడ్డుపై…
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని మూడు విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. హైదరాబాద్ నుండి చెన్నై వెళ్లాల్సిన రెండు ఇండిగో విమానాలు, చెన్నై నుండి హైదరాబాద్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ వర్గాలు అప్రమత్తమయ్యాయి.
HYDRA Volunteers : ట్రాఫిక్ పోలీసులకు హైడ్రా వాలంటీర్ల సహకారం అందివ్వనున్నారు. ట్రాఫిక్ పోలీసులకు సహకరించేందుకు హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధమవుతున్నారు. గోషామహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో మొదటి విడతగా 50 మందికి శిక్షణ ఇస్తున్నారు ట్రాఫిక్ అధికారులు. ఈక్రమంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణ మెలుకువలు హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది నేర్చుకుంటున్నారు. హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్లు పేరిట ముఖ్యమైన కూడళ్లు, ట్రాఫిక్ రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులకు తోడుగా సేవలు అందించనున్నారు హైడ్రా వాలంటీర్లు. ట్రాఫిక్ రద్దీ, ఇతర…
హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ-కార్ రేస్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ నిధుల కేటాయింపులపై మున్సిపల్ శాఖ ఏసీబీకి ఫిర్యాదు చేసింది. నిధుల బదలాయింపుపై విచారణ జరపాలని కోరింది.
సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో.. 14 రోజులపాటు రిమాండ్ విధించారు. ఓ ల్యాండ్ ఇష్యూకు సంబంధించి ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్‌లోని నందినగర్‌లో మోమోస్ తిని ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.. మరో 20 మందికి పైగా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా.. మోమోస్ షాప్ నిర్వహిస్తోన్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఈ ఘటనపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లక్ష్మీకాంత్ స్పందించారు.
అక్రమ పటాకుల నిల్వలే హైదరాబాద్‌లో ప్రమాదాలకు కారణమని జిల్లా ఫైర్ అధికారి వెంకన్న వెల్లడించారు. అక్రమ గోదాంలపై నిఘా కొనసాగుతోందన్నారు. వెండర్స్ నకిలీ క్రాకర్స్ అమ్మకాలు జరపొద్దని.. లేబుల్ ఉన్న క్రాకర్స్ మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. నివాసం, సముదాయాల ప్రాంతాల్లో క్రాకర్స్ దుకాణాలకు అనుమతి లేదన్నారు.
మూడు సంవత్సరాల బాలికను కిడ్నాప్‌కు పాల్పడిన యువకుడిని బండ్లగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బండ్లగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అల్ జుబేల్ కాలనీకి చెందిన సోహైల్ (25) బాలికను కిడ్నాప్ చేసేందుకు యత్నించినట్లు పోలీసులు వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వ రోజ్‌గార్ మేళాలో భాగంగా నేడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలను ప్రధాని, కేంద్ర మంత్రులు నేడు అందజేస్తున్నారు. దేశ వ్యాప్తంగా 51 వేల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో 155 మందికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు.
హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రెయిన్ బజార్‌లోని ఇంట్లో నిల్వ ఉంచిన టపాసులు ఒక్కసారిగా పేలాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా..మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. దీపావళి పండుగ సందర్భంగా ఓ ఇంట్లో పెద్ద మొత్తంలో బాణాసంచాను నిల్వ ఉంచారు.