బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూసీ ప్రక్షాళన చేయాల్సిందే... నీళ్లు ఇవ్వాల్సిందేనని అన్నారు. కృష్ణా, గోదావరి నదుల నుండి తీసుకువచ్చిన అభ్యంతరం లేదని తెలిపారు. ఒక్క ఇల్లు కూలగొట్టిన ఊరుకునేది లేదు.. ఇల్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల తరఫు లాయర్ రేపు వాదనలు వినిపించనున్నారు. ఈరోజు విచారణలో మొదట ఎమ్మెల్యే కడియం శ్రీహరి తరఫున న్యాయవాది మయూర్‌రెడ్డి వాదనలు వినిపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదించారు.
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా ఈ-రేసింగ్‌పై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోటర్ కార్ల రేసింగ్ క్రీడ ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన క్రీడ అని అన్నారు. ఫార్ములా -1 మొదటి రేసింగ్ 1946లో ఇటలీలో జరిగిందని తెలిపారు. ఈ ఫార్ములా వన్ 24 రేసింగ్‌లు నిర్వహిస్తుంది.. భారతదేశం కూడా ఫార్ములా వన్ రేసింగ్ నిర్వహించేందుకు ఎదురు చూసిందని పేర్కొన్నారు.
Mallu Bhatti Vikramarka: మేము వచ్చాక ఆ లక్ష్యాలను చేరుకుంటున్నాని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అశోక్ నగర్ లో రావుస్ అకాడమీ ఫర్ కాంపిటీటివ్ ఇన్స్టిట్యూట్ ను ప్రారంభించారు.
Telangana: కుల గణన సర్వేను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుంది. నేటి నుంచి ఇంటింటికి కుటుంబ సర్వే నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
హైడ్రా అనే పేరుతో రేవంత్ రెడ్డి సర్కారు కేవలం బ్లాక్ మెయిల్ దందా చేసే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా విధానాల వల్ల భూములు అమ్మడంలో జాప్యం అవుతూ రియల్టర్లు, బిల్డర్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ తెలిపారు.
KTR: ఇందర పార్క్ దగ్గర ధర్నా చౌక్ లో ఆటో డ్రైవర్స్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడికి ఆటో లో వచ్చాను.. తమ జీవితాలన్ని అస్తవ్యస్తంగా అయ్యాయని నేను ఎక్కిన ఆటో డ్రైవర్ అన్నారు.
Hyderabad: ఇందిరా పార్క్‌లో ఆటో డ్రైవర్ల మహాధర్నా కార్యక్రమం కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన ఫ్రీ బస్సు కారణంగా నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆటో, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ జేఏసీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహిస్తున్నారు.