భాగ్యనగరంలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను పోలీస్ విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సర్కార్ ఆదేశించింది. ఈ క్రమంలో.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు. ఆపరేషన్ రోప్లో భాగంగా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఫుట్ పాత్ ఆక్రమణలను తొలగించనున్నారు పోలీసులు. ఫిల్మ్ నగర్ నుంచి టోలిచౌకి మెజెస్టిక్ గార్డెన్స్ వరకు రెండు క్యారేజ్‌వేలలో ఆపరేషన్…
Drug Peddling Gang Arrested: హైదరాబాద్ నగరం రోజురోజుకి మాదకద్రవ్యాలకు అడ్డాగా మారుతోందా అని అనిపిస్తోంది. గత కొద్దిరోజుల నుంచి నగర పోలీసులు, ఎస్టిఎఫ్ పోలీసులు దాడుల నేపథ్యంలో పబ్బులు, ప్రవేట్ పార్టీలలో పెద్ద సంఖ్యలో ఈ మత్తు పదార్థాలు దొరుకుతున్నాయి. మరోవైపు కొందరు గంజాయి విక్రయించే గ్యాంగులు నగరంలో హల్చల్ చేస్తున్నాయి. ఎవరికైనా గంజాయి, డ్రగ్స్ కావాలంటే కేవలం ఫోన్ చేస్తే చాలు మీరు ఎక్కడ ఉన్నారో అక్కడికి డెలివరీ చేసేలా సేవలు అందిస్తున్నట్లు సమాచారం.…
హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణపై ఆ సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో ప్రప్రథమంగా పీపీపీ మోడల్ లో ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేయగలిగాం.. సిఎం రేవంత్ చాలా పకడ్బందీ ప్రణాళికతో వెళ్దామన్నారు.. మాకు ఇచ్చిన ఇంస్ట్రక్షన్ లో ఆర్డినరీ పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మెట్రో అభివృద్ధి చేయాలన్నారు.. అభివృద్ధి అంటే కేవలం పశ్చిమ దిక్కు మాత్రమే కాదు నగరం మొత్తం ఉండాలన్నారు.
Minister Komatireddy: జాతీయ రహదారుల భూసేకరణపై ఎన్‌హెచ్ అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీరియస్ అయ్యారు. రైతులకు అడ్వాన్సులు వెయ్యకుండా భూసేకరణ ఎలా చేస్తారని అధికారులను ప్రశ్నించారు.
Telangana BJP: భారత రాజ్యాంగ దినోత్సవం నాడు తెలంగాణ బీజేపీ ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజ్యాంగ విలువలను అనుక్షణం కాపాడుతున్నారని చెప్పుకొచ్చింది.
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన ఆచూకీ లభిస్తే అరెస్టు చేసేందుకు ఒంగోలు పోలీసులు సిద్ధమయ్యారు. డిజిటల్ మోడ్ లో విచారణకు హాజరవుతానని ఆర్జీవీ చేసిన రెక్వెస్ట్ ను తోసిపుచ్చారు పోలీసులు.. రెండు సార్లు విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇచ్చినా ఆర్జీవీ సద్వినియోగం చేసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. నోటీసులను ధిక్కరించారు కాబట్టే అరెస్ట్ వరకు వెళ్ళాల్సి వచ్చిందంటున్నారు.
ప్రతీ ఏడాది కార్తిక మాసంలో భక్తి టీవీ, ఎన్టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవం దిగ్విజయంగా ముగిసింది.. ఈ నెల 9వ తేదీన ప్రారంభమైన ఈ మహా దీపయజ్ఞం 17 రోజుల పాటు కొనసాగాయి.. ఈ నెల 25వ తేదీన అంటే.. కార్తిక చివరి సోమవారం రోజు ముగిసింది..
హైదరాబాద్‌లోని మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో మూసారం బాగ్ ఓ కన్సుల్టెన్సీ ఆఫీస్ లో పనిచేస్తున్న గిరిజన యువతి, లా విద్యార్థిని ఇస్లావత్ శ్రావ్య(20) అనుమాన స్పద స్థితిలో ఆఫీస్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.. అయితే... హత్య చేసి ఆత్మహత్య గా చిత్రీకరించారంటూ పీఎస్ ముందు గిరిజన సంఘాల నేతలు,కుటుంబ సభ్యుల ఆందోళనకు దిగారు.
కార్తీక మాసానికి ప్రత్యేక స్థానం ఉంది.. హిందువులు ఈ నెలలో శివుడు, విష్ణువులిద్దరి పూజ కొరకు చాలా పవిత్రంగా భావిస్తారు.. కార్తీక స్నానాలకు, ఈ మాసం వివిధ వ్రతాలకు శుభప్రధమైనదిగా పురాణాలు చెబుతున్నాయి.. ఇక, కార్తీక మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తుల చూపు మొత్తం ఎన్టీవీ-భక్తి టీవీ నిర్వహించే కోటిదీపోత్సవంపైనే ఉంటుంది. కార్తిక మాసం శుభవేళ.. రోజుకో కల్యాణం, వాహనసేవ, పీఠాధిపతుల ప్రవచనాలు, ప్రముఖుల ఉపన్యాసాలతో ‘కోటి దీపోత్సవం’ దిగ్విజయంగా…