హైదరాబాద్‌లో కుల గణన ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నారు. కాగా.. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సమర్థవంతంగా నిర్వహించేందుకు నోడల్ ఆఫీసర్లను నియమించింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీ పరిధిలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను సమర్ధవంతంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. 30 సర్కిళ్లకు 10 మంది నోడల్ ఆఫీసర్లను నియమిస్తూ.. వారి కింద మూడు సర్కిళ్ల చొప్పున వీరికి బాధ్యతలను అప్పగించింది జీహెచ్ఎంసీ.
తెలంగాణలో 13 మంది ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పర్యాటకం, సాంస్కృతిక, యువజన సర్వీసులు కార్యదర్శిగా స్మిత సబర్వాల్‌ను నియమించారు. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ కార్యదర్శిగా అదనపు బాధ్యతల్లో స్మిత సబర్వాల్ కొనసాగనున్నారు.
హైదరాబాద్‌లోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో మరో డ్రగ్ ముఠా గుట్టురట్టు అయింది. నగరంలో కన్జ్యూమర్లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు పెడ్లర్లను బాలాపూర్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి డ్రై గంజాతో పాటు మొదటిసారిగా ఓషియన్ గంజా పట్టుబడింది.
కార్తిక సోమవారము శుభవేళ ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి కల్యాణం చూసే మహా భాగ్యాన్ని కల్పిస్తోంది భక్తి టీవీ.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో ‘కోటి దీపోత్సవం’ దిగ్విజయంగా కొనసాగుతోంది. దీపాల పండగలో ఇప్పటికే రెండు రోజులు పూర్తి కాగా.. వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఇక, నేడు కోటి దీపోత్సవంలో మూడవ రోజు. అందులోనూ కార్తిక సోమవారం కాబట్టి..
ఫోన్ ట్యాపింగ్ కేసులో నకిరేకల్ మాజీ ఎమ్యెల్యే చిరుమర్తి లింగయ్య జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు గైర్హాజరు అయ్యారు. అనారోగ్య కారణంగా జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఎదుట విచారణకు రాలేనని పోలీసులకు సమాచారం అందించారు మాజీ ఎమ్మెల్యే. ఈ నెల 14న విచారణకు హాజరవుతానని చెప్పారు.
హైదరాబాద్‌లోని ఆరాంఘర్ చౌరస్తాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ స్క్రాప్ గోదాంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని సమాచారం. బస్సుల స్క్రాప్ గోదాంలో మంటల చెలరేగాయి. మంటల దాటికి దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
హైదరాబాద్‌లోని ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. గత కొద్ది రోజులుగా కూల్చివేతలను పక్కన పెట్టిన హైడ్రా మళ్లీ ఆక్రమిత నిర్మాణాలపై విరుచుకుపడుతోంది. హైడ్రా బృందం సోమవారం అమీన్ పూర్‌కు చేరుకుంది. జేసీబీలు, డిజాస్టర్ టీంతో సహా పటేల్ గూడకు అమీన్ పూర్ మున్సిపల్ కమిషనర్, హైడ్రా అధికారులు చేరుకున్నారు.
రామంతపూర్ ఓయో రూంలో ప్రేమికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ప్రియుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇంటి అద్దె కట్టలేదని యజమాని ఓ యువతిపై కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటన అత్తాపూర్ హసన్ నగర్ లో చోటుచేసుకుంది. కొద్ది నెలలుగా ఇంటి అద్దె కట్టకపోవడంతో యువతి పై కత్తితో దాడి చేయగా.. ఆమె చేతికి, తలకు కత్తి గాయాలయ్యాయి. గాయాల పాలైన యువతిని ఆస్పత్రికి తరలించారు.
ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి దీపోత్సవం రెండో రోజు ఘనంగా ముగిసింది. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. కోటి దీపోత్సవం కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆ పరమశివుడి సేవలో పాల్గొన్నారు.