Agniveer Recruitment Rally: ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలనుకునే రాష్ట్ర యువతకు శుభవార్త. తెలంగాణలో అగ్నివీరుల రిక్రూట్మెంట్ ర్యాలీ తేదీలు, వేదిక ఖరారయ్యాయి.
కార్తిక మాసం శుభవేళ భక్తి టీవీ, ఎన్టీవీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’ 15వ రోజు ఘనంగా ముగిసింది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. కోటి దీపోత్సవం కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆ పరమశివుడి సేవలో పాల్గొన్నారు. అంతేకాకుండా.. దీపాలను వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. పిల్లా, పెద్ద అని తేడా లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని 15వ రోజు విజయవంతం చేశారు. కోటి దీపోత్సవం వేళ…
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ‘కోటి దీపోత్సవం’ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. రోజుకో విశేష కార్యక్రమాలతో ఎన్టీఆర్ స్టేడియం కళకళలాడుతుంది. దేవతా మూర్తుల కల్యాణం, వాహనసేవ, పీఠాధిపతుల ప్రవచనాలు, ప్రముఖుల ఉపన్యాసాలతో ‘కోటి దీపోత్సవం’ విజయవంతంగా కొనసాగుతోంది.
హైదరాబాద్ ఆటగాడు, టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20ల్లో వరుసగా మూడు సెంచరీలు బాదిన తొలి బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ ట్రోఫీ 2024లో భాగంగా ఈరోజు జరిగిన మ్యాచులో మేఘాలయపై తిలక్ సెంచరీ చేశాడు. హైదరాబాద్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన తిలక్.. 67 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లతో 151 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో చివరి…
Hyderabad: ఉప్పల్ లో దారుణం చోటుచేసుకుంది. చిన్నారి కంట్లో నలక పడిందని ఆసుపత్రికి వెళితే ప్రాణం తీసిన ఘటన నగరంలో కలకలం రేపింది. హన్విక కుటుంబ సభ్యులు ఉప్పల్ లో నివాసం ఉంటున్నారు.
‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. గోద్రా ఘటనను తప్పుడుగా చిత్రీకరించి చరిత్రను కనుమరుగు చేసేందుకు యత్నించిన కాంగ్రెస్, ఒక సెక్షన్ మీడియా కుట్రలను ఈ సినిమా ద్వారా బట్ట బయలు చేయడం అభినందనీయమన్నారు.
కోటి దీపోత్సవం వేళ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం శివనామస్మరణతో 14వ రోజు మార్మోగిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి.. దీపాల పండుగలో పాల్గొని ఈ లోకాన్నే మరిచేలా పునీతులయ్యారు.
CM Revanth Reddy : కామన్ వెల్త్ మెడ్-ఆర్బ్ కాన్ఫరెన్స్- 2024 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ వంటి కొత్త కార్యక్రమాలతో టెక్నాలజీలో హైదరాబాద్ గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతోందని, సాఫ్ట్వేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ మరియు బయో-టెక్నాలజీ పరిశ్రమలకు పవర్ హబ్‌గా హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. న్యాయవ్యవస్థ మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, కానీ, భారీ సంఖ్యలో కేసులు పెండింగ్‌లో…
హైడ్రా బ్రెయిన్ స్టోర్మ్ సమావేశంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ.. ఎఫ్టీఎల్లో ఉన్న నిర్మాణాలన్నీ కూల్చివేసి చెరువులు పరిరక్షించడం హైడ్రా ఉద్దేశం కాదన్నారు. చెరువులను పునరుద్దరించాలంటే ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.