CM Revanth Reddy : 3,200 ఈవీ బస్సులను ఆర్టీసీలోకి తీసుకువస్తున్నాం..
- తెలంగాణ అభివృద్ధికి సంబంధించి మాకో కల ఉంది.. అదే తెలంగాణ రైజింగ్
- హైదరాబాద్‌లో ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించుకున్నాం
- న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్ వంటి నగరాలతో ఫ్యూచర్ సిటీ పోటీ పడుతుంది
- ఫ్యూచర్ సిటీ.. కాలుష్య రహిత సిటీగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. : సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : హైటెక్ సిటీలో CII జాతీయ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ CII గ్రీన్ బిజినెస్ సెంటర్‌లో సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించడం సంతోషమన్నారు. తెలంగాణ ఏర్పడి దశాబ్దం గడుస్తోంది… తెలంగాణ అభివృద్ధికి సంబంధించి మాకో కల ఉంది.. అదే తెలంగాణ రైజింగ్ అని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఫోర్త్ సిటీ…ఫ్యూచర్ సిటీ ని నిర్మించాలని నిర్ణయించుకున్నామని, న్యూయర్క్ , లండన్, టోక్యో, సియోల్ , దుబాయ్ వంటి నగరాలతో ఫ్యూచర్ సిటీ పోటీ పడుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భారతదేశంలోనే గొప్ప నగరాన్ని నిర్మించాలని అనుకుంటున్నాం.. ఇందులో సేవా రంగం మాత్రమే ఉంటుందని, ఫ్యూచర్ సిటీ కాలుష్య రహిత నెట్ జీరో సిటీగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 3,200 ఈవీ బస్సులను ఆర్టీసీ లోకి తీసుకువస్తున్నామని, ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్, రోడ్డు పన్ను ను తొలగించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
Parents Tips : దయచేసి మీ పిల్లల ముందు ఈ 5 విషయాల గురించి మాట్లాడుకోకండి
Also Read
- Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
అంతేకాకుండా..’భారతదేశంలోనే ఎలక్ట్రిక్ వాహనాలు అత్యంత వేగంగా అమ్ముడవుతున్న రాష్ట్రం తెలంగాణ. ప్రకృతి విపత్తులను ఎదుర్కొవడానికి హైదరాబాద్ సిద్ధమౌతోంది.. వరదలు లేని నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దాలనుకుంటున్నాం .. మూసీ పునరుజ్జీవనంతో 55 కిలో మీటర్ల వరకు మంచినీటితో ప్రవహించేలా చేయనున్నాం. 2050 సంవత్సరానికి అవసరమయ్యే తాగు నీటి అవసరాలకు కావాల్సిన కార్యచరణ ను ఇప్పటి నుంచే ప్రారంభించాం.. రీజినల్ రింగ్ రోడ్ ప్రణాళికల దశలో ఉంది.. 360 కి.మీ పొడవు రీజినల్ రింగ్ రోడ్ ను నిర్మిస్తున్నాం.. దాని చుట్టూ రీజినల్ రింగ్ రైల్వేను ప్లాన్ చేస్తున్నాము. ORR, RRRలను అనుసంధానించే రేడియల్ రోడ్లు కూడా నిర్మించబోతున్నాం.. ORR, RRR మధ్య ప్రాంతం తయారీ రంగానికి కేంద్రంగా ఉండబోతుంది.. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, EVలు, సోలార్ వంటి పరిశ్రమలను ఇక్కడ ఏర్పాటు కాబోతున్నాయి.. స్కిల్స్, ఉద్యోగాల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించాం.. ప్రపంచంలో హైదరాబాద్ ను చైనా కు ప్లస్ సిటీ గా మార్చే వ్యూహంతో ముందుకు వెళ్తున్నాం..
అవుటర్ రింగ్ రోడ్ బయట ఉన్న గ్రామీణ తెలంగాణ లో వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగుల వంటి పైన దృష్టి పెడతాము. తెలంగాణ కు తీరప్రాంతం లేదు. అందుకే ఇక్కడ డ్రై పోర్ట్ ఏర్పాటు చేయనున్నాం.. ఏపీలోని బందర్ ఓడరేవు తో అనుసంధానం చేస్తూ ప్రత్యేక రహదారి తో పాటు రైల్వే కనెక్షన్ ఏర్పాటు చేయబోతున్నాం.. మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందాలని ,మార్కెట్లు స్వేచ్ఛగా పనిచేయాలని మేము కోరుకుంటున్నాము. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మాతో కలిసి రండి.. రండి.. కలిసి అద్భుతాలు సృష్టిద్దాం.. భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అత్యున్నత వ్యాపార సౌలభ్యాన్ని నేను మీకు అందిస్తాను..’ అని సీఎం రేవంత్ రెడ్డి.
Bomb Threat: ఢిల్లీలో స్కూల్స్కు బాంబు బెదిరింపు.. 12వ తరగతి విద్యార్థి అరెస్ట్!
తాజావార్తలు
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!