Hyderabad: హైదరాబాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. రాజేంద్రనగర్‌లో ఇండిగో ఎయిర్‌లైన్స్ క్యాబిన్ క్రూగా పనిచేస్తున్న యువతి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలిని జాహ్నవి గుప్తాగా పోలీసులు గుర్తించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. జాహ్నవి ఇండిగో కెప్టెన్, మరో ఫ్రెండ్‌తో కలిసి పార్టీ చేసుకుంది. అనంతరం తన గదికి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న సహచరులు, స్నేహితులు షాక్‌కు గురయ్యారు.
Hyderabad Tragedy: మా ఆయిష్షు కూడా పోసుకొని నిండు నూరేళ్లూ వర్ధిల్లు అని దీవించాల్సిన చేతులతోనే తల్లిదండ్రులు తమ పిల్లల ప్రాణాలు తీస్తున్నారు. దాంపత్య జీవితంలో గొడవలు, కుటుంబ కలహాలు, అనారోగ్య కారణాలు, ఆర్ధిక సమస్యలు.. ఇలా కారణాలు ఏవైవా కావొచ్చు. పెద్ద వాళ్ల సమస్యలకు చిన్నారులు సమిధలవుతున్నారు.. నిజానికి పిల్లలకు ఒంట్లో కాస్తంత నలతగా ఉంటేనే కన్నవారు తీవ్రంగా కలవరపడిపోతారు! ఆడుకుంటూ పొరపాటున కింద పడ్డ బిడ్డకు చిన్నగాయమైతేనే విలవిల్లాడిపోతారు.
ఓ వైపు కొడుకు అనారోగ్యం.. మరోవైపు కుటుంబాన్ని పట్టించుకోని భర్త.. పైగా ఆర్ధికంగా రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. పెద్ద కొడుకుపై దొంగతనం ముద్ర పడడంతో మానసికంగా మరింత కుంగిపోయింది. ఆ తల్లి అలసిపోయి.. ఇక బతకలేనని నిర్ణయించుకుంది. పుట్టెడు దుఃఖంతో చిన్న కొడుకు కళ్లెదుటే బలవన్మరణం చెందింది. ఈ ఘటన హైదరాబాద్ ఎల్బీనగర్‌లో విషాదం నింపింది. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న వారి పేర్లు నరసింహ, సుధ. వీరి స్వస్థలం ప్రకాశం జిల్లా కందుకూరు. సుధ,…
Ramantapur: హైదరాబాద్ నగరంలోని రామంతపూర్ గోఖలే నగర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకల సందర్భంగా ఘోర విషాదం చోటుచేసుకుంది. శ్రీకృష్ణుడి విగ్రహ శోభాయాత్రలో రథం విద్యుత్ తీగలకు తాకడంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా మారడంతో వారిని మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. Weather Update: తడిసి ముద్దైన తెలంగాణ.. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు! ఈ ప్రమాదంలో కృష్ణ యాదవ్ (24), శ్రీకాంత్ రెడ్డి (35), సురేష్ యాదవ్ (34), రుద్ర…
హైదరాబాద్‌లో కల్తీ కల్లు కలకలం సృష్టించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకి చేరినట్లు తెలుస్తోంది. తాజాగా కల్తీ కల్లు సేవించి వాంతులు, విరోచనాలతో కూకట్‌పల్లి రాందేవ్ రావు ఆసుపత్రికి వచ్చే లోపే మౌనిక(25) అనే యువతి మృతి చెందింది. కానీ ముగ్గురు మాత్రమే మరణించినట్లు అధికారికంగా వెల్లడించారు. సీతారం, స్వరూప, మౌనిక మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. నారాయణమ్మ, బొజ్జయ్య అనే ఇద్దరు కూడా కల్తీ కల్లు తాగడం వల్లే చనిపోయినట్లు తెలుస్తోంది.
పెళ్లై రెండు నెలలు కూడా కాలేదు...!! భర్త వేధిస్తున్నాడని భార్య హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది ! లక్కీగా స్థానికులు కాపాడారు. ప్రాణాలతో బయటపడింది. హమ్మయ్య అనుకునేలోపు.. భార్య కేసు పెట్టిందని భర్త హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హ్యాపీగా సంసారం చేసుకోవాల్సిన జంట.. సాగర్ లో ఎందుకు దూకింది. పచ్చని సంసారంలో చిచ్చుపెట్టిందెవరు..?
Suicide : హైదరాబాద్ సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎర్రగడ్డలోని జనప్రియ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న ఓ మహిళ 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. శనివారం (14-06-2025) ఉదయం 8:30 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం… ఆత్మహత్య చేసుకున్న మహిళ పేరు కొక్కినీ శ్రావణి (30), ఆమె తిమ్మాపురం, ఏలూరు జిల్లా వాసి. కొద్ది నెలల క్రితమే హైదరాబాద్‌కు వలసవచ్చి, జనప్రియ…
Tragedy : జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారం ప్రాంతంలో ఓ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మానసికంగా చితికిపోయిన ఓ తల్లి, తన ఇద్దరు చిన్నారులను వేట కొడవలితో నరికి, అనంతరం బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణ ఘటన మృతిచెందిన తల్లి తేజస్విని రెడ్డిగా, ఆమె కుమారులు హర్షిత్ రెడ్డి (7), ఆశిష్ రెడ్డి (5) గా పోలీసులు వెల్లడించారు. తేజస్విని తన చిన్న కొడుకు ఆశిష్‌కు…
హైదరాబాద్‌లో మరో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో అపార్ట్మెంట్లో లిప్టు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాలుడు అక్బర్ (10)మృతి చెందాడు. బంతితో ఆడుతూ బంతి లిఫ్ట్ గోతిలో పడడంతో తీయడానికి వెళ్లాడు అక్బర్ పటేల్. అదే సమయంలో లిఫ్ట్ వెయిట్ తలపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలానికి చెందిన నిమ్మల బోయిన సందీప్ (29) అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని అతను ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందిన వెంటనే కుటుంబ సభ్యులు సదాశివనగర్‌కు మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.కుటుంబ సభ్యుల ప్రకారం.. సందీప్ వివిధ క్రెడిట్ కార్డులు, లోన్ యాప్స్ ద్వారా సుమారు 15 లక్షల రూపాయల అప్పు…