Tragedy : బేగంపేట్‌లో విషాదం.. పూజ చేస్తుండగా అగ్నికి ఆహుతైన రిటైర్డ్ ప్రిన్సిపాల్
- పూజలో విషాదాంతం
- చీరకు అంటుకున్న మంటలు
- ఇల్లంతా వ్యాపించిన అగ్ని
- అప్రమత్తత అవసరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భక్తితో దేవుడిని ప్రార్థిస్తున్న సమయంలో జరిగిన ఒక చిన్న పొరపాటు ఓ ప్రాణాన్ని బలిగొంది. బేగంపేట్‌లో నివసిస్తున్న రిటైర్డ్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి పూజ చేస్తుండగా దీపం మంటలు చీరకు అంటుకుని సజీవ దహనమయ్యారు. ప్రశాంతంగా సాగిపోతున్న ఆమె జీవితం ఒక్కసారిగా అగ్నికి ఆహుతి కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్ బేగంపేట్ పరిధిలో నివసిస్తున్న విజయలక్ష్మి (రిటైర్డ్ ప్రిన్సిపాల్) ప్రతిరోజూ లాగే శుక్రవారం కూడా ఇంట్లో దేవుడికి పూజ చేసుకుంటున్నారు. పూజలో భాగంగా దీపారాధన చేస్తున్న సమయంలో ఆమె కట్టుకున్న చీరకు ప్రమాదవశాత్తు దీపం మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు వేగంగా వ్యాపించడంతో ఆమె వాటిని ఆర్పే ప్రయత్నం చేశారు.
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
అయితే, మంటలు ఒక్కసారిగా ఇంట్లోని సోఫా , కర్టెన్లకు కూడా అంటుకోవడంతో క్షణాల్లో ఇల్లంతా దట్టమైన పొగ కమ్మేసింది. మంటల తీవ్రత , ఊపిరాడని పొగ కారణంగా విజయలక్ష్మి తప్పించుకోలేక అక్కడే కుప్పకూలిపోయారు. మంటలు మరింతగా వ్యాపించడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. విజయలక్ష్మి ఇంట్లో నుంచి దట్టమైన పొగ రావడం గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే అప్రమత్తమయ్యారు. ఏదో ప్రమాదం జరిగిందని గ్రహించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
KKR Unwanted Record: కేకేఆర్ ఖాతాలో చెత్త రికార్డు.. కోల్‌కతా చరిత్రలోనే..!
ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ, అప్పటికే విజయలక్ష్మి మంటల్లో కాలి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. విజయలక్ష్మి మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూజ చేసే సమయంలో ప్రమిదలు, దీపాలు పెట్టుకునేటప్పుడు మహిళలు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
-
China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!