Suicide : హైదరాబాద్ సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎర్రగడ్డలోని జనప్రియ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న ఓ మహిళ 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. శనివారం (14-06-2025) ఉదయం 8:30 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం… ఆత్మహత్య చేసుకున్న మహిళ పేరు కొక్కినీ శ్రావణి (30), ఆమె తిమ్మాపురం, ఏలూరు జిల్లా వాసి. కొద్ది నెలల క్రితమే హైదరాబాద్‌కు వలసవచ్చి, జనప్రియ అపార్ట్‌మెంట్‌లో హౌస్ కీపింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమెకు ఇద్దరేళ్ల కుమారుడు ఉన్నాడు. కుటుంబ కలహాలే ఆమె ఆత్మహత్యకు కారణమై ఉంటాయని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటనతో అపార్ట్‌మెంట్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Himachal Pradesh: ముస్లిం అబ్బాయితో కలిసి పారిపోయిన హిందూ అమ్మాయి..చివరికీ..