Traffic Alert: హైదరాబాద్ ప్రజలకు నగర ట్రాఫిక్ అధికారులు అలర్ట్ చేశారు. నేడు, రేపు (21,22) ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని వెల్లడించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురు, శుక్రవారాల్లో నగరంలో పర్యటించనున్న నేపథ్యంలో రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని..
చేతక్ హెలికాప్టర్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో హాజరు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్. నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ లో ఛేతక్ హెలికాప్టర్ల వజ్రోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరయ్యారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. చేతక్ హెలికాప్టర్లు 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హకీం పేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఆధ్వర్యంలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించారు. చేతక్ హెలికాఫ్టర్ ఒక మిషన్…
ఏపీ సీఎం జగన్ సోమవారం నాడు హైదరాబాద్ వెళ్లనున్నారు. శంషాబాద్‌లో శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్‌ను ఏపీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సీఎం జగన్ మధ్యాహ్నం 3:50 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరనున్నారు. సాయంత్రం 4:30 గంటలకు శంషాబాద్ చేరుకుని అక్కడి నుంచి శ్రీ చినజీయర్ స్వామి ఆశ్రమానికి చేరుకుంటారు. చినజీయర్ స్వామి ఆశ్రమంలో జరిగే శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో సీఎం జగన్…
ప్రధాని మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రధాని మోదీని రిసీవ్ చేసుకునే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దూరమయ్యారు. ముందుగా ప్రధానికి ఆహ్వానం పలికేందుకు కేసీఆర్ కూడా వస్తున్నారని ప్రచారం జరిగినప్పటికీ.. ఆయనకు జ్వరం కారణంగా హాజరుకాలేదని తెలుస్తోంది. కేసీఆర్‌కు జ్వరంగా ఉందని.. అందుకే ఆయన ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. అయితే సాయంత్రం ముచ్చింతల్‌లో జరిగే రామానుజచార్యుల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాత్రం కేసీఆర్ హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. Read Also: చలితో…
ఫిబ్రవరి 5న హైదరాబాద్ నగరానికి ప్రధాని మోదీ రానున్నారు. ఈ సందర్భంగా ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలు, ముచ్చింతల్‌లో రామానుజచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో మోదీ పాల్గొననున్నారు. ఫిబ్రవరి 5 న మధ్యాహ్నం 2:45 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రధాని మోదీ చేరుకోనున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో పఠాన్‌చెరువులోని ఇక్రిశాట్‌కు చేరుకోనున్నారు. అక్కడ స్వర్ణోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సాయంత్రం 5 గంటల సమయంలో శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌కు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. అక్కడ…