Hyderabad: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని మూసీ నదికి వరద ఉధృతి పెరుగుతోంది. ముసారాంబాగ్ వంతెనను తాకుతూ నది ప్రవహిస్తూనే ఉంది.
Red Alert issued for Next Two Days in Hyderabad: రానున్న 24 గంటల్లో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అవసరం అయితేనే బయటికి రావాలని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా…
తెలంగాణా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. రెండు గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో నగరం నానిపోయింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు నగరవాసులు.
TS Rains: బంగాళాఖాతంలో ఇప్పటికే అల్పపీడనం ఏర్పడింది. రేపు (24) దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
గత మూడు రోజులుగా కురుస్తు్న్న వర్షాలు హైదరాబాద్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. దంచి కొడుతున్న వర్షాలతోపలుచోట్ల కాలనీలు నీటమునిగాయి. మణికొండ పంచవటి కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంచవటి కాలనీ మునిగిపోయింది.
రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు శుక్రవారం, శనివారం సెలవు ప్రకటించింది. ఇవాళ, రేపు ఇప్పటికే సెలవులు ప్రకటించగా.. ఎల్లుండి శనివారం కూడా విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.
గ్రేటర్ హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌కు అతి భారీ వర్ష సూచన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించడంతో జీహెచ్‌ఎంసీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.