Hyderabad Rains News: హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. భారీ వర్షంతో నగరంలోని ప్రధాన మార్గాలు, కాలనీలు, లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే మోకాలిలోతు వరకు నీరు చేరింది. రోడ్లపైకి భారీ నీరు వస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉప్పల్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, సరూర్‌నగర్, నాగోల్, అల్కాపురి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది.…