ఎండ ప్రచండ కిరణాలనుంచి హైదరాబాద్ వాసులకు ఉపశమనం కలిగింది. వాతావరణ శాఖ అంచనాలు నిజమయ్యాయి. నిన్న ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం, తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రంలో ఉన్న అల్పపీడనం తూర్పు-ఈశాన్య దిశగా కదిలి, ఈరోజు 0830 గంటల IST సమయంలో ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీద తీవ్ర అల్పపీడనంగా ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది అండమాన్ నికోబార్ దీవుల వెంబడి ఉత్తర…
సంచలనం సృష్టించిన పంజాగుట్ట చిన్నారి హత్య కేసులో మిస్టరీ వీడుతోంది. పంజాగుట్ట పాప హత్య కేసులో పురోగతి కనిపిస్తోంది. చిన్నారి మృతదేహాన్ని ఓ ఆటోలో నిందితులు తీసుకొచ్చినట్లు పోలీసులు సీసీ ఫుటేజీల ద్వారా గుర్తించారు. మహిళతో పాటు మరో ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలే హత్యకు కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించిన సంగతి తెలిసిందే. నిందితులు బెంగళూరులో పాపని చంపి హైదరాబాద్ తీసుకొచ్చినట్లు గా గుర్తించారు. పాప హత్య కేసు…
హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది… దాదాపు రెండు గంటలకు పైగా వర్షం దంచికొడుతోంది… బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మలక్‌పేట్, నాగోల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట్, అబ్దుల్లాపూర్‌మెట్, దిల్‌సుఖ్‌నగర్, సరూర్‌నగర్, బడంగ్‌పేట్, మెహిదీపట్నం, అత్తాపూర్, రాజేంద్రనగర్, కిస్మత్‌పూర్, శంషాబాద్ సహా తదితర ప్రాంతాల్లో జోరు వాన కురుస్తోంది.. దీంతో.. పలుచోట్ల చెరువులను తలపిస్తున్నాయి రోడ్లు, లోతట్టు ప్రాంతాలకు వర్షం చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.. దీంతో.. అప్రమత్తమైన…
గులాబ్ తుఫాన్ ప్రభావం తెలంగాణపై తీవ్ర ప్రభావాన్నే చూపిస్తోంది… హైదరాబాద్‌తో పాటు.. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.. 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, 17 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు.. ఇక, హైదరాబాద్‌లో మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరించింది.. రానున్న 5, 6 గంటలు హైదరాబాద్ సిటీలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు హైదరాబాద్ వాతావరణ శాఖ…
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో నిన్న భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, తార్నాక,ఉప్పల్, హబ్సిగూడ, రామంతపూర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, విద్యానగర్, అంబర్‌పేట్, రాంనగర్, దోమలగూడ, చిలకలగూడ, అల్వాల్, బేగంపేట ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నగర శివారు ప్రాంతాలైన ఎల్బీనగర్, హయత్‌నగర్‌తోపాటు చార్మీనార్‌లో భారీగా వాన కురిసింది. అత్యధికంగా బహదూర్‌పురాలో 9 సెంటీమీటర్లు, చార్మినార్‌లో ఐదున్నర సెంటీమీటర్లు, సైదాబాద్‌లో 4 సెంటీమీటర్లు, ఝాన్సీబజార్‌లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగర శివారు ప్రాంతాలైన రాజేంద్రనగర్, మేడ్చల్ ప్రాంతాల్లో…
హైదరాబాద్‌లో ఇవాళ మధ్యాహ్నం నుంచే వర్షం ప్రారంభమైంది.. ఇప్పటికే.. సైదాబాద్, సంతోష్‌నగర్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్, కోఠి.. తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.. ఇక, సాయంత్నాకి మరికొన్ని ప్రాంతాలకు విస్తరించి.. ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, రాంనగర్, కవాడీగూడ, ఇందిరా పార్క్, దోమలగూడ, విద్యానగర్, అడిక్‌మెట్, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.. కూకట్‌పల్లి, చందానగర్, కేపీహెచ్‌బీ తదితర ప్రాంతాల్లో…
తెలంగాణలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి.. ఇక, హైదరాబాద్ మహా నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.. ఓవైపు జంట జలశాయాలు నిండు కుండల్లా మరడంతో.. గేట్లను ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. లోతట్టు ప్రాంతాలో ఇళ్లలోకి నీరు చేరి పలు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. ఇక, వాహనదారులు రోడ్లపైకి రావాలంటేనే వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం పడనుందని హెచ్చరించింది వాతావరణశాఖ.. సాయంత్రం 6 గంటల నుంచి 8…
హైదరాబాద్‌లో భారీ వర్షం దంచి కొట్టింది. మూడు గంటల పాటు కురిసిన వానకు… జంటనగరాల వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా ప్రాంతాల్లో… మోకాళ్ల లోతు నీరు చేరింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.. పాతబస్తీ బహదూర్‌పురా వద్ద రహదారిపైకి భారీగా వరద నీరు రావడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. మాదాపుర్ శిల్పారామం సమీపంలో ప్రధాన రహదారిపై భారీగా చేరిన వరద నీరడంతో పాటు డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి.…