హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్ అలర్ట్. మెట్రో టైమింగ్స్ లో మార్పులు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో రైళ్ల సేవా సమయాలను సవరించింది. సవరించిన సమయాలు ఈనెల 3 నుంచి అమల్లోకి రానున్నాయి. నవంబర్ 3 నుంచి అన్ని లైన్లలోని టర్మినల్ స్టేషన్ల నుంచి మెట్రో సేవల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 6:00 గంటల నుంచి రాత్రి 11:00 గంటల వరకు నడపనున్నట్లు ప్రకటించింది. Also Read:Ind-Pak: పాకిస్థాన్ కపటత్వాన్ని…