Hyderabad Cybercrime: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐ-బొమ్మ, బప్పం సైట్లను పూర్తిగా క్లోజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. శనివారం సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సైట్‌లు క్రియేట్ చేసిన రవితోనే వాటిని క్లోజ్ చేయించినట్లు తెలుస్తోంది. అయితే.. నిందితుడు ఐ బొమ్మ ఇమ్మడి రవి గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కూకట్‌పల్లిలోని రవి అపార్ట్మెంట్‌లో పోలీసులు సోదాలు నిర్వహించారు..