సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌పై కొనసాగుతున్న విచారణలో కేంద్ర క్రిమినల్ సర్వీస్ (CIS) పోలీసులు కీలక వివరాలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలో, ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత ను ఒకరోజు కస్టడీకి తీసుకుని వివరమైన విచారణ చేపట్టారు.
Hyderabad kidnapping: హైదరాబాద్‌లో చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాలు తిరుగుతున్నాయి. మొన్నటికి మొన్న చందానగర్‌లో ఓ బాలున్ని ముఠా సభ్యులు ఎత్తుకెళ్లారు. ఆ ఘటన మరువక ముందే కొండాపూర్‌లో మరో చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు ఓ మహిళ ప్రయత్నించింది. కానీ అలర్ట్ అయిన స్థానికులు ఆమెను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. యస్.. మీరు విన్నది కరెక్టే. హైదరాబాద్‌లో చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే బూచోళ్లు తిరుగుతున్నారు. దీంతో తల్లిదండ్రుల ఒడిలో హాయిగా ఆడుకోవాల్సిన పిల్లలు.. కిడ్నాపర్ల చేతికి చిక్కి…
Whatsapp Group: ఆటోను దొంగిలించి పారిపోయిన దొంగను.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టించింది ఓ వాట్సప్ గ్రూప్. చోరీ చేసిన కొన్ని గంటల్లోనే దొంగ అడ్డంగా దొరికిపోయాడు. వాట్సప్ గ్రూప్‌లో ఉన్న ఫ్రెండ్స్ అంతా ఏకమై ఆటోను దక్కేలా చేశారు. ఇంతకూ ఆటో దొంగకు.. వాట్సప్ గ్రూప్‌కి ఉన్న లింక్ ఏంటి..? ఎక్కడో ఆల్వాల్‌లో ఆటో పోతే.. బంజారాహిల్స్‌లో ఎలా పట్టుబడ్డాడు. చోరీలకు పాల్పడిన దొంగలను పోలీసులు తెలివిగా పట్టుకోవడం చూశాం.. లేదా సీసీ కెమెరాల సాయంతో అడ్డంగా…
Charlapally Drug Case: చర్లపల్లి డ్రగ్స్ కేసులో పోలీసులు విచారణను లోతుగా కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ప్రముఖ నిందితుడైన ‘విజయ్ ఓలేటి’ సంబంధించి అనేకజా విషయాలను పోలీసులు రాబట్టారు. అతను 12 సంవత్సరాల పాటు GVK బయో సైన్స్ లో కెమికల్ అనాలిస్ట్‌గా పని చేశాడు. ఆ తర్వాత ఐదు సంవత్సరాల క్రితం ఆయన బయోసైన్స్ కంపెనీ నుండి బయటకు వచ్చి కెమికల్ తయారీ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించాడు. నిందితుడు విజయ్ ఓలేటి, మహారాష్ట్ర నుండి…
హైదరాబాద్ లో భారీ డ్రగ్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు.. డ్రగ్స్ సేవిస్తున్న పది మందిని ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ టీం అదుపులోకి తీసుకుంది. ఇద్దరు పెడ్లర్లతో పాటు 8 మంది ట్రాన్స్‌జెండర్ (గే) కన్జ్యూమర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పెడ్లర్ల నుంచి వంద గ్రాముల ఎండీ ఎంఎస్ స్వాధీనం చేసుకున్నారు. Grinder అనే యాప్ ద్వారా డ్రగ్స్ కొనుగోలు, అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించారు. ఇందులో ట్రాన్స్జెండర్లు (గే) సైతం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆశ్చర్యానికి…
Ganesha Laddu Robbery: గణపతి మండపాల నిర్వాహకులకు మరో పెద్ద సమస్య వచ్చి పడింది. వినాయక మండపాల్లో దొంగలు పడుతున్నారు.. అలా అని హుండీలోని డబ్బో.. వినాయకుడి మెడలో ఉన్న నోట్ల దండో.. విలువైన వస్తువులో మాయం కావడం లేదు. వినాయకుడి చేతిలో ఉండాల్సిన లడ్డూ రాత్రికి రాత్రే మాయం అవుతోంది. పవిత్రంగా భావించే గణేష్ లడ్డూను కూడా చోరీ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. మండపాల్లోనే నిర్వాహకులు అర్ధరాత్రి వరకు కాపలాగా ఉంటున్నా.. దొరికిన చిన్న గ్యాప్‌లోనే…
వివాహేతర సంబంధానికి మరో భర్త బలయ్యాడు. హైదరాబాద్ సరూర్‌నగర్‌లో ఓ భార్య వేసిన స్కెచ్‌కు భర్త ఊపిరి ఆగిపోయింది. ప్రియుడితో కలిసి చంపేసి.. అనంతరం ‘భర్త పడుకుని ఇంకా లేవడం లేదని’ డ్రామా ఆడింది కిలాడి. కానీ పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించే సరికి నిజం ఒప్పుకుంది. దీంతో ఆమెను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు. నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం మాదారానికి చెందిన జల్లెల శేఖర్.. రంగారెడ్డి జిల్లా వెల్దండ మండలం…
సరూర్ నగర్ భర్త హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త శేఖర్(40) ని తన భార్య డంబెల్స్ తో మోది హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. భర్త శేఖర్ నిద్రిస్తున్న సమయంలో భార్య చిట్టి డంబెల్స్ తో మోదగా, ప్రియుడు హరీష్ గొంతు నులిమి హత్యకు పాల్పడ్డారు. కొద్దీ రోజుల క్రితమే భార్య చిట్టికి హరీష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడినట్లు తెలిపారు. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. శేఖర్,చిట్టీలకు కూతురు,కుమారుడు పిల్లలున్నారు.…