Police Arrest:హైదరాబాద్‌లోని ఓ ప్రవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న జాదవ్ సాయి తేజ (19) సీనియర్ విద్యార్థుల రాగింగ్, వేధింపులకు విసుగు చెంది ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మేడిపల్లిలో ఉన్న మధు బాయ్స్ హాస్టల్‌లో తన గదిలో ఉరివేసుకొని సాయి తేజ ప్రాణాలు తీసుకున్నాడు. ఆత్మహత్య ముందురోజు సీనియర్లు అతన్ని మద్యం తాగమని ఒత్తిడి చేసి, బార్‌కు తీసుకెళ్లారని.. అక్కడ రూ. 10,000 బిల్ కట్టమని మరింత ఒత్తిడి చేసి, బెదిరించారు. ఈ వేధింపులతో మానసికంగా కుంగిపోయిన సాయి తేజ ఆత్మహత్యకు ముందు ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు.
Storyboard: ఇల వైకుంఠంలో శ్రీవారి వైభవం.. 9 రోజులపాటు కొంగొత్త శోభ..
ఇక తాజాగా బీటెక్ విద్యార్థి జాదవ్ సాయి తేజ ఆత్మహత్య కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. సాయి తేజ తండ్రి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసి.. నిందితులైన శివకుమార్, ప్రశాంత్, రోహిత్, మురళీధర్, సాయి ప్రసాద్‌లను అరెస్టు చేశారు. కోర్టు వారికి రిమాండ్ విధించడంతో వారందరినీ జైలుకు తరలించారు.
IP69 రేటింగ్, 7,000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో Oppo A6 Pro 4G లాంచ్.. ధర ఎంతంటే?