Honour Killing: గోల్కొండలో ఘోరం.. యూట్యూబర్‌ను వెంటాడి చంపిన వైనం..!
- ప్రేమ వివాహంపై యువతి కుటుంబం కక్ష.. నడిరోడ్డుపై దాడి
- కర్రలు, ఇనుప రాడ్లు, కత్తులతో యూట్యూబర్‌పై దారుణ దాడి
- గోల్కొండ పోలీసులు వేగంగా దర్యాప్తు.. నలుగురు నిందితుల అరెస్ట్
- పరువు హత్య ఘటనపై స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honour Killing: హైదరాబాద్‌లోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరమైన పరువు హత్య ఉదంతం వెలుగుచూసింది. కేవలం ప్రేమ వివాహం చేసుకున్నాడనే కక్షతో ఒక యువ యూట్యూబర్‌ను నడిరోడ్డుపై దారుణంగా కొట్టి చంపిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మసూద్ అనే యూట్యూబర్ గత 2025లో రుక్షార్ బేగం అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే, వీరి ప్రేమ వివాహాన్ని యువతి కుటుంబ సభ్యులు మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ మసూద్‌పై పగ పెంచుకున్నారు. ఈ క్రమంలోనే నాలుగు రోజుల క్రితం ప్రియురాలి కుటుంబ సభ్యులు పథకం ప్రకారం మసూద్ ఇంటికి వచ్చి కర్రలు, ఇనుప రాడ్లు, , కత్తులతో ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. నడిరోడ్డుపైనే ఆయనను తీవ్రంగా గాయపరిచి రక్తం మడుగులో ముంచి కిరాతకంగా హతమార్చారు.
ఈ ఘోర హత్యోదంతంపై కేసు నమోదు చేసుకున్న గోల్కొండ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టి, యూట్యూబర్ మసూద్ హత్యకు కారణమైన నలుగురు ప్రధాన నిందితులను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నిందితులపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు గోల్కొండ పోలీసులు వెల్లడించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకే ఒక యువకుడి ప్రాణాలు తీయడంపై మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం నిండగా, స్థానిక ప్రజలు ఈ అమానుష చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
తాజావార్తలు
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!