Fraud : హైదరాబాద్ మాదాపూర్లో నారాయణ విద్యాసంస్థల మాజీ ఉద్యోగి కొత్త దందాతో చర్చనీయాంశమయ్యాడు. మాదాపూర్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో బిల్డింగ్ కట్టిస్తానంటూ టీ.శ్రీహరి అనే వ్యక్తి దాదాపు 40 మందిని లక్షల్లో మోసం చేసినట్టు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. నారాయణ సంస్థల్లో పనిచేసిన అనుభవాన్ని నమ్మి ఉద్యోగులే శ్రీహరికి డబ్బులు పెట్టుబడి పెట్టారు. బిల్డింగ్లో ఫ్లాట్లు కేటాయిస్తానంటూ ఒక్కొక్కరి నుండి లక్షల్లో వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఆ డబ్బుతో శ్రీహరి మరో అపార్ట్మెంట్లో ఫ్లాట్లు…
హైదరాబాద్ నగరంలోని జగద్గిరిగుట్టలో దారుణ హత్య చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం జగద్గిరిగుట్ట బస్టాండ్ వద్ద రౌడీ షీటర్ రోషన్ సింగ్ (25)ను మరో రౌడీషీటర్ బాలశౌ రెడ్డి, అతని అనుచరులు ఆదిల్, మహమ్మద్లు కలిసి కత్తులతో దారుణంగా నరికి హత్య చేశారు. హత్య అనంతరం నిందితులు బులెట్ బైక్పై అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు…
Hyderabad: మల్కాజిగిరి పరిధిలోని కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుటే దారుణం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన సింగిరెడ్డి మీన్ రెడ్డి అనే వ్యక్తి తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Ganja Gang: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని ఎర్రబొడ కాలనీలో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. పార్క్ చేసిన కార్ అద్దాలు ధ్వంసం చేశారు. కారు అద్దాలు ఎందుకు పగలగొట్టారని ప్రశ్నించిన యజమానితో ఈ పొకిరి బ్యాచ్ దురుసుగా ప్రవర్తించింది. ఈ సందర్భంగా నాకు పగలగొట్టాలని అనిపించింది అందుకే పగలగొట్టాను, ఎక్కువగా మాట్లాడితే కారు మొత్తం తగలబెడతానని ఉల్టా బెదిరింపులకు ఈ గంజాయి బ్యాచ్ దిగింది.
Hyderabad: హైదరాబాద్లోని నాచారం ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒంటి మీద చట్నీ పడేశాడని ఓ వ్యక్తిని కొందరు యువకులు కిరాతంగా హతమార్చారు. రెండు గంటల పాటు కారులో తిప్పుతూ.. సిగరెట్లతో కాల్చుతూ చివరికి కత్తితో దారుణంగా హత్య చేశారు.
Pocso Case : హైదరాబాద్ లో దారుణం జరిగింది. బోయిన్ పల్లిలో డ్యాన్స్ మాస్టర్ జ్ఞానేశ్వర్ సుబ్బు డ్యాన్స్ స్టూడియో నిర్వహిస్తున్నాడు. గత రెండు నెలలుగా అతని వద్ద డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చిన నాలుగేళ్ల చిన్నారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఎవరూ లేని టైమ్ లో ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. డ్యాన్స్ నేర్చుకునేందుకు వచ్చిన అమ్మాయిపై ఇలా ప్రవర్తించడంతో ఆమె చాలా భయపడిపోయింది. కొన్ని రోజులుగా డ్యాన్స్ స్కూల్ కు వెళ్లను అంటూ మారాం చేసింది. దీంతో…
Ganja Batch : హైదరాబాద్ నగరంలోని బండ్లగూడలో శనివారం రాత్రి గంజాయి మత్తులో ఉన్న యువకులు రెచ్చిపోయారు. చంద్రయాన్ గుట్ట ఏరియాలోని ASIపై దాడి చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులే ముప్పతిప్పలు పడేలా ఆ గంజాయి బ్యాచ్ ప్రవర్తించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బండ్లగూడ ప్రాంతంలో గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు యువకులు అర్ధరాత్రి సమయంలో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. గాయపడ్డ వారు రోడ్డు మీద రచ్చ రచ్చ చేస్తుండటంతో…
Fraud: వైద్య వృత్తిలో ఉన్న ఓ కిలాడీ జంట చిట్టీల పేరుతో మోసానికి పాల్పడింది. చిట్టీల పేరుతో ప్రజల్ని మోసగించిన దంపతుల సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. నిజాంపేట బండారీ లేఅవుట్లో ‘రేష్మ క్లినిక్’’ పేరుతో వైద్యులుగా చలామణి అవుతున్న రేష్మ, అలీ అనే భార్యాభర్తలు సుమారు 100 మందికి పైగా వ్యక్తుల నుంచి దాదాపుగా రూ. 150 మేర వసూలు చేసినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ జువైనల్ హోంలో మళ్లీ లైంగిక దాడి ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఒక బాలుడిపై లైంగిక దాడి కేసులో నిందితుడిగా ఉన్న సూపర్వైజర్ రెహమాన్ (27) పై మరోసారి కొత్త కేసు నమోదైంది.