Hyderabad: టీమిండియాలో హైదరాబాద్ యువకుడు మహమ్మద్ మాలిక్‌కు అవకాశం లభించింది. అండర్-19 ఏ జట్టులో చోటు దక్కించుకున్న మాలిక్ ప్రస్తుతం ఫాస్ట్ బౌలర్‌గా అద్భుత ప్రతిభ కనబరుస్తున్నాడు. నాంపల్లి మల్లెపల్లికి చెందిన ఈ యువ క్రికెటర్ వినూ మన్కడ్ ట్రోఫీలో తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ టోర్నమెంట్‌లో మాలిక్ అత్యధిక వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.
ఇండియా క్రికెట్‌లో అన్ని రాష్ట్రాల అసోసియేషన్లు తమ ప్లేయర్ల కోసం లీగ్స్ నడిపిస్తున్నాయి. కొత్త టాలెంట్‌ను బయటికి తీయడంలో ఈ లీగ్స్ ఉపయోగపడుతాయి. కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మాత్రం అందుకు భిన్నం. ఇక్కడ లీగ్ పక్కన పెడితే కనీసం వివాదం లేకుండా.. ఈ అసోసియేషన్‌ని రన్ చేయలేరు. ఇప్పటికే ఎన్నో వివాదాలతో పరువు పోగొట్టుకున్న హెచ్‌సీఏ.. ఇప్పుడు మరో వివాదంలో నిలించింది. Also Read: Afghanistan Cricket: చరిత్ర సృష్టించిన ఆఫ్గనిస్తాన్.. ప్రపంచంలోనే మొదటి…
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌కు బిగ్‌షాక్ ఇచ్చింది.. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్‌కు అజారుద్దీన్ పేరు తొలగించాలని ఆదేశించింది. హెచ్‌సీఏకు అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఈ ఆదేశాలు జారీ చేశారు.. లార్డ్స్ క్రికెట్ క్లబ్ వేసిన పిటిషన్‌పై అంబుడ్స్‌మన్ విచారణ చేపట్టారు..హైదరాబాద్ క్రికెట్ సంఘం ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో తన పేరు పెట్టుకోవాలని అజార్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నట్లు గుర్తించారు. దీంతో విచారణ చేపట్టి వెంటనే ఆ పేరును తొలగించారు.