కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన వినాశనం ఇంకా మన కళ్లలో మెదులుతూనే ఉంది. ఆ పాపంలో ప్రభుత్వాల పాత్ర కూడా ఉంది. ఎన్నికల సభలు సూపర్ స్ప్రెడర్స్ గా మారాయి. తెలంగాణలో కరోనా కేసుల పెరుగుదలకు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కూడా ఒక కారణం. ఇప్పుడు థర్డ్ వేవ్ పొంచి ఉన్న సమయంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగుతోంది. హుజూరాబాద్‌లో ప్రధాన ప్రత్యర్థులు ప్రచార వేగం పెంచారు. నేతల వెంట జనం గుంపులు గంపులుగా తిరుగుతున్నారు.…
హుజూరాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కావడంతో అందరి చూపు ఈ నియోజకవర్గంపైనే పడింది. సీఎం కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్లుగా ఈ ఉప ఎన్నిక మారిపోయింది. రేసులో ఎంతమంది ఉన్నా వారంతా థర్డ్ ప్లేసుకోసమో పోటీ పడాల్సిందేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హుజూరాబాద్ లో గెలిచేది టీఆర్ఎస్ లేదంటే బీజేపీ అభ్యర్థి మాత్రమేనని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఈ ఎన్నిక రిజల్ట్ ఎలా ఉంటుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈటల రాజేందర్ అసైన్డ్…
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణం లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు మంత్రి గంగుల కమలాకర్. అనంతరం ఆయన మాట్లాడుతూ… హుజూరాబాద్ మున్సిపాలిటీకి 50 కోట్లతో అభివృద్ది పనులు చేస్తున్నాం అని తెలిపారు. హుజూరాబాద్ నుండి సైదాపూర్ రోడ్డు కు అరు కోట్ల తో పనులు ప్రారంభం ఉన్నాయి. ఆరు సార్లు గెలిచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎందుకు అభివృద్ది చేయలేదు. కరీంనగర్ లో వేసిన రోడ్ల లాగా హుజూరాబాద్ రోడ్లను అధునికరిస్తం అని…
హుజారాబాద్ ఉప ఎన్నికలకు ఇంకా సమయం వుంది. ప్రధాన పక్షాలు దానిని సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డాయి. ముఖ్యంగా అధికార టీఆర్‌ఎస్ గెలుపే లక్ష్యంగా శ్రేణులను సిద్ధం చేస్తోంది. ఈ ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ “విశ్వసనీయత” అంశాన్ని తెరమీదకు తెచ్చింది. దీని ద్వారా ఓటర్ల మనసు గెలవాలని గులాబీ ప్లాన్. టీఆర్‌ఎస్ ప్రయోగిస్తున్న “క్రెడిబిలిటీ కార్డుకు” విరుగుడుగా బీజేపీ “ఆత్మగౌరవం” నినాదాన్ని ముందుకు తెచ్చింది. దానిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. నాయకులను కొనుగోలు చేయొచ్చు…
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పొరపాటున బీజేపీ గెలిస్తే పదేళ్ల అభివృద్ధి వెనక్కి పోతుందన్నారు మంత్రి హరీష్‌రావు.. కరీంనగర్ జిల్లా వీణవంకలో మంత్రి హరీష్ రావు సమక్షంలో పలువురు నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం అన్నారు.. ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ గెలిస్తే పది సంవత్సరాలు అభివృద్ధి ముందుకెళ్తుంది.. పొరపాటున బీజేపీ గెలిస్తే 10 సంవత్సరాలు అభివృద్ధి వెనక్కి వెళ్తుందన్నారు.. వ్యక్తి ప్రయోజనం ముఖ్యమా.. హుజురాబాద్…
హుజురాబాద్ ఎన్నికల ప్రచారానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మూడు సార్లు వస్తారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. త్వరలోనే అమిత్ షా పర్యటనకు సంబందించిన షెడ్యూలు చెబుతామన్నారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘హుజురాబాద్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా వేసే అవకాశం ఉంది.. హుజురాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోతుందని సీఎం ఢిల్లీ వెళ్లాడు. టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నాయి. నిర్మల్ అమిత్…
నిరంతరం ప్రజల కోసం పని చేసే సీఎం కేసీఆర్‌కు.. ఉప ఎన్నికల్లో హుజురాబాద్ గెలుపును కానుకగా ఇద్దాం… మీ అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటానని అన్నారు ఆర్థిక మంత్రి హరీష్‌రావు.. హుజురాబాద్ నియోజకవర్గంలోని సింగాపూర్ దేశాయిపల్లిలో మంత్రి హరీష్‌రావు సమక్షంలో పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు గ్రామస్తులు.. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండేలా పని చేస్తోన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులను…
ఎన్నికలంటేనే బోల్డంత ఖర్చు. పోలింగ్ తేదీ ఖరారైతే ఖర్చుకు ఒక లెక్క తెలుస్తుంది. హుజురాబాద్‌లో మాత్రం అంతా రివర్స్. ఉపఎన్నిక ఎప్పుడో తెలియదు. 2 నెలలుగా ప్రధాన పార్టీలు డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్నాయి. జేబులు ఖాళీ అవుతున్నాయి తప్ప ఎలక్షన్ ఎప్పుడో.. ఏంటో.. క్లారిటీ లేదు? ఇంకా ఎన్ని రోజులు.. ఎంత ఖర్చు పెట్టాలో తెలియక ఆందోళన చెందుతున్నారట నేతలు. వందల మందితో కలిసి ఎన్నికల ప్రచారం! హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు.…
ఉపఎన్నిక జరిగే హుజురాబాద్‌లో కాంగ్రెస్ వ్యూహం కొలిక్కి రావడం లేదు. బరిలో దిగే అభ్యర్థిపై క్లారిటీ ఉన్నా.. ప్రకటన చేయడానికి జంకుతున్నారు. వేచి చూద్దాం అనుకుంటున్నారో లేక ఇంకేదైనా వ్యూహం ఉందో కానీ నాన్చడానికే ప్రాధాన్యం ఇస్తున్నారట. దీంతో ఏమైందో గాంధీభవన్ వర్గాలకు అర్థం కావడం లేదట. రావిర్యాల సభలోనే హుజురాబాద్ అభ్యర్థిని ప్రకటించాలని అనుకున్నారా? హుజూరాబాద్ ఎన్నికపై ఆచి తూచి వ్యవహారం నడిపిస్తుంది తెలంగాణ కాంగ్రెస్. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అడుగులు వేయాలన్నది పార్టీ ఆలోచనగా…
రేపు జరుగనున్న ‘దళితబంధు పథకం’ ప్రారంభోత్సవానికి హుజూరాబాద్ వేదిక ముస్తాబైంది. సీఎం కేసీఆర్ హాజరయ్యే ఈ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. 100 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో వేదికను తయారుచేశారు. వేదికపైకి 15 దళిత బంధు లబ్ధిదారుల కుటుంబాలతో పాటుగా పలువురు ఎంపీలు, మంత్రులు కూర్చోనున్నారు. ఈ సభకు లక్షా 20 వేల మంది హాజరవుతారని భావిస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ గ్రామంలో ఈ సభ జరుగనుంది. ఇక త్వరలోనే హుజూరాబాద్…