హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ 30 వేల మెజార్టీతో గెలవబోతున్నాడని కుండ బద్దలు కొట్టారు కోమటి రెడ్డి. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ పార్టీ 5 వేల కోట్లు ఖర్చు చేసిందని నిప్పులు చెరిగారు. హుజురాబాద్ ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టు అని మండిపడ్డారు. హుజురాబాద్ ప్రజలు అదిరి పోయే తీర్పు ఇవ్వబోతున్నారని స్పష్టం చేశారు.…
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియం ప్రారంభమైంది. బీజేఈ అభ్యర్థి ఈటల రాజేందర్, టీఆర్‌ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్, కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్‌లు బరిలో ఉన్నారు. మొదట అధికారులు స్ట్రాంగ్ రూమ్ సీల్ ఓపెన్ చేశారు. ఏజెంట్లు, అధికారుల సమక్షంలో ఈవీఏంలను పరిశీలించారు. వీరితో పాటు మరో 27 మంది బరిలో ఉన్నా.. పోటీ మాత్రం ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ, టీఆర్‌ఎస్ ల మధ్య ఉండబోతోంది. ఈ నేపథ్యంలో…
హుజురాబాద్ లో కారు దూసుకెళ్తుందా…? కమలం వికసిస్తుందా.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది. మరోసారి గెల్చి సిట్టింగ్ సీటు దక్కించుకుంటామని అధికార పార్టీ చెబుతుంటే.. ఈటల గెలుపు పక్కా అనే ధీమాతో ఉంది కమలం పార్టీ. అయితే ఇరుపార్టీలు భారీగా డబ్బులు పంచినా.. తమ ఓట్లు తమకే పడ్డాయని కాంగ్రెస్ చెబుతోంది.బీజేపీ, trs మధ్య హోరా హోరీగా సాగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం మరి కొన్ని గంటల్లో వెలువడనుంది. 5 నెలల పాటు ఇరుపార్టీలు…
భూకబ్జా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి ఈటల రాజేందర్‌ను తెలంగాణ ప్రభుత్వం బర్తరఫ్ చేసింది. దీంతో ఎమ్మెల్యే పదవికి, టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈటల. ఈ నేపథ్యంలో హుజురాబాద్‌లో ఉప ఎన్నికకు దారితీసింది. హుజురాబాద్ లో మరోసారి టీఆర్‌ఎస్ జెండా ఎగరవేసేందుకు కేసీఆర్ తన అనుచర గణాన్ని మొత్తం ఉపయోగించారనడంలో సందేహం లేదు. హుజురాబాద్ గడ్డమీద గులాబీ జెండా రెపరెపలాడించాలని గెల్లు శ్రీనివాస్ ను అభ్యర్థిగా ప్రకటిస్తూ.. మంత్రి హరీశ్‌రావుకు ఇంచార్జీ బాధ్యతలు కేసీఆర్…
హుజురాబాద్ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలకు 306 పోలింగ్ స్టేషన్‌లను ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ఎన్నికల నిబంధనలు ఎవ్వరూ ఉల్లఘించిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటివరకు 88 ఫిర్యాదులు అందినట్లు ఆయన పేర్కొన్నారు. వీటితో పాటు డబ్బు, మద్యం పంపిణీ ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతామని.. నిజాలు తేలితే ఎన్నికల అనంతరం కూడా…
హుజురాబాద్ ఉప ఎన్నికకు ఈ రోజు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 306 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారనంటూ.. ఒకరిపైఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు పోలీసులు షాక్…
హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక పోలింగ్ చిన్న చిన్న గోడవలు మినహా… ఇప్పటి వరకైతే… పోలింగ్ చాలా ప్రశాంతంగా సాగుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే హిమ్మత్ నగర్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్. కుటుంబ సమేతంగా వచ్చిన టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్… తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. తన ఓటు హక్కు వినియోగించుకున్నానని… ప్రజా స్వామ్యం…
ఎంఐఎం చీఫ్ అసుదుద్దీన్ ఓవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరిగే ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు మరియు హుజురాబాద్ ఉప ఎన్నికల్లోనూ.. బీజేపీ పార్టీకి ఓటమి తప్పదని స్పష్టం చేశారు ఓవైసీ. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ మొత్తం 100 స్థానాల్లో పోటీ… చేయనుందని.. ఓవైసీ తెలిపారు. యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడమే తమ లక్ష్యమన్నారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కూడా అసదుద్దీన్ ఓవైసీ..…
హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 7 గంటల కు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే… ఉదయం నుంచి ప్రశాంతంగా సాగిన ఈ ఉప ఎన్నికలో కాస్త ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హుజురాబాద్ వీణవంక మండలం కోర్కల్ గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కోర్కల్ లో పోలింగ్ కేంద్రం వద్ద టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కొట్టుకున్న కార్యకర్తల్లో మహిళలు…