ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియం ప్రారంభమైంది. బీజేఈ అభ్యర్థి ఈటల రాజేందర్, టీఆర్‌ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్, కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్‌లు బరిలో ఉన్నారు. మొదట అధికారులు స్ట్రాంగ్ రూమ్ సీల్ ఓపెన్ చేశారు.
ఏజెంట్లు, అధికారుల సమక్షంలో ఈవీఏంలను పరిశీలించారు. వీరితో పాటు మరో 27 మంది బరిలో ఉన్నా.. పోటీ మాత్రం ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ, టీఆర్‌ఎస్ ల మధ్య ఉండబోతోంది. ఈ నేపథ్యంలో అధికారులు ముందు చెప్పిన విధంగానే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. 753 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు.