పచ్చటి సంసారంలో సైతం కేసీఆర్ చిచ్చు పెడతారని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి ఈటల రాజేందర్… హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని కొత్తపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటల రాజేందర్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ లేని పద్ధతుల్లో ఇక్కడ పుడితే టీఆర్ఎస్‌లోనే ఉండాలి అని బెదిరిస్తున్నారని మండిపడ్డారు.. ఉద్యోగాలు పీకేస్తాం అని, పెన్షన్, కళ్యాణ లక్ష్మీ రాకుండా చేస్తామని అంటున్నారట.. ఆపడం ఎవరికీ సాధ్యం కాదని హెచ్చరించారు. వీటికి ఇచ్చే డబ్బులు…
తెలంగాణలోని హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఈ నెలలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.. పాలక, ప్రతిక్షాలు ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.. నువ్వా నేనా అనే పరిస్థితి హుజురాబాద్‌లో కనిపిస్తోంది.. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధించింది ఎన్నికల కమిషన్.. ఈ విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వెల్లడించారు.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఎగ్జిట్ పోల్ సర్వే…
టీఆర్ఎస్ అంతర్గత ఆధిపత్య పోరుతోనే హుజురాబాద్‌లో ఉప ఎన్నికలు వచ్చాయని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి… హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని మామిడాలపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూర్ వెంకట్ తరపున ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరలుఉ ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ. టీఆర్ఎస్ అంతర్గత ఆధిపత్య పోరుతో ఉప ఎన్నికలు వచ్చాయని ఆరోపించారు.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు మంత్రిగా పనిచేసిన…