నగరం మధ్యలో ‘అమీబా’ ఆకారంలో ఉండే సాగర్ పర్యాటకం పరంగా అత్యంత ఆహ్లాదమైన ప్రదేశం. సరస్సు మ ధ్యలో ప్రపంచలోనే అతి పొడవైన బుద్దు డి విగ్రహం ఒక అ పురూపమైన అద్భుత దృశ్యం. దీన్ని న్యూయార్క్ లోని ‘స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ’ తరహాలో ఏర్పాటు చేశారు. దీనిని వీక్షించేందుకు నిత్యం పెద్ద సంఖ్యలో సందర్శకులు విచ్చేస్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని చెరువు చుట్టూ లూప్ రూపంలో ఒక సమగ్రమైన రోప్ నెట్ వర్క్ ను ఏర్పాటు…
గులాబీ పార్టీ సంబురానికి సర్వం సిద్ధం అయ్యింది.. హైదరాబాద్ గులాబీ మయం అయిపోయింది.. తెలంగాణ రాష్ట్ర సమితి 21 వసంతాలు పూర్తి చేసుకుని 22 వసంతంలోకి అడుగు పెడుతోన్న వేళ హైదరాబాద్ వేదికగా ప్లీనరీ నిర్వహించేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఇక, ప్రతినిధుల సభ ఈసారి 3 వేల మందితో జరుగనుంది. ఘనంగా ప్లీనరీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది అధిష్టానం.. ఇక, తోరనాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు.. కటౌట్లు.. ఇలా ఎటు చూసినా గులాబీ రంగు పులుముకుంది.. ఇదే…
తెలంగాణ సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా టీఆర్ఎస్ నేతలు, ఆయన అభిమానులు తెలంగాణ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. అన్ని చోట్ల కేసీఆర్ బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన టీఆర్ఎస్ యువజన నాయకుడు అలిశెట్టి అరవింద్ ప్రత్యేక అభిమానం చాటుతూ దేశంలోనే తొలిసారిగా బోటుపై బ్యానర్‌ను ఆవిష్కరించారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉండే హుస్సేన్ సాగర్‌లో బుద్ధుడి విగ్రహం పక్కన ప్రత్యేకమైన బోటులో కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ…
హైదరాబాద్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.. చార్మినార్, గోల్కొండ, జంట జగరాలను కలపే హుస్సేన్‌సాగర్ అందాలు కనువిందు చేస్తాయి.. ఇక, శివారు ప్రాంతాల్లోనే మరికొన్ని స్పాట్లు కూడా ఆకట్టుకుంటాయి.. త్వరలో హైదరాబాదీలు, పర్యాటకులకు అసలైన థ్రిల్ అందించేందుకు సర్కార్ సిద్ధం అవుతోంది.. రష్యా రాజధాని మాస్కోలోని ప్రఖ్యాత పర్యాటక స్థలం ఫ్లోటింగ్ బ్రిడ్జిను పోలిన బ్రిడ్జి.. ఇప్పుడు మన హైదరాబాద్‌లో రాబోతోంది.. పీవీఎన్‌ఆర్ మార్గ్‌లో అంటే నెక్లెస్ రోడ్డులో హుస్సేన్ సాగర్ మీద ఈ ఏడాది చివరికల్లా ఆ…
హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతులు మంజూరు చేయడంతో ట్యాంక్ బండ్ వద్ద వినాయకుల నిమజ్జనానికి ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నారు. ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర రేపు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం కాబోతున్నది. దీనికి సంబందించిన ఏర్పాట్లును నిర్వహకులు వేగంగా చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టు పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక ఈ రోజు రాత్రి 9 గంటల తరువాత ఖైరతాబాద్ గణపతి దర్శనానికి అనుమతిని రద్దు చేశారు. రేపు తెల్లవారుజామున 3…
హుస్సేన్ సాగర్‌లో గణేశ్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ట్యాంక్‌బండ్ లోని హుస్సేన్ సాగర్‌లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయకూడదని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం వేసిన రివ్యూ పిటిషన్‌ను కూడా హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ఇచ్చింది. హుస్సేన్ సాగర్‌లో విగ్రహాల నిమజ్జనానికి అనుమతులు మంజూరు చేసింది.…
నిమజ్జనంపై తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడిదే చర్చ జరుగుతోంది. హైకోర్టు తీర్పుతో సిటీలో గణేశ్ నిమజ్జనంపై .. గందరగోళం నెలకొంది. నిమజ్జనం నిబంధనలకు సంబంధించి తీర్పును పునఃసమీక్షించలేమని.. హైకోర్టు తేల్చి చెప్పడంతో సిటీలోని భారీ గణనాథుల నిమిజ్జనంపై సందిగ్ధం ఏర్పడింది. ట్యాంక్ బండ్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనానికి హైకోర్టు నిరాకరించడంతో.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది జీహెచ్‌ఎంసీ. దీనిపై రేపు ఉదయం విచారణ చేపట్టనున్న అత్యున్నత ధర్మాసనం.. ఎలాంటి తీర్పునిస్తుందనేది ఉత్కంఠరేపుతోంది. ఇప్పటికే ట్యాంక్ బండ్‌లో…
వినాయక నిమజ్జనం అంటేనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్ వైపే చూస్తారు.. ముఖ్యంగా నిమజ్జన శోభాయాత్ర.. హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జన కార్యక్రమంపైనే అందరి దృష్టి.. అయితే, ఈ ఏడాది హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం ఉంటుందా? లేదా? అనేది మాత్రం ఇంకా ఉత్కంఠగానే మారిపోయింది… వినాయక విగ్రహాల నిమజ్జనంపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ).. హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని నిరాకరిస్తూ.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానంలో సవాల్…