OTT Platforms : బడికి, కాలేజీలకు వెళ్లే టీనేజీ స్టూడెంట్స్, యూత్ ని టార్గెట్ చేస్తూ పక్కా బూతు కంటెంట్ తో కొన్ని ఓటీటీలు గ్యాంబ్లింగ్ చేస్తున్నాయన్న విమర్శలు ఇటీవల కాలంలో వచ్చాయి.
ఒడిశాలోని నువాపాడా జిల్లాలో చిరుతపులిని వేటాడిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ వేటగాళ్ళు చిరుతపులిని చంపి, దాని చర్మం తీసి, దాని మాంసాన్ని వండుకుని తిన్నారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ కేసు నువాపా జిల్లా దేవ్‌ధార గ్రామ సమీపంలో ఉంది.
Tirumala: వన్య ప్రాణుల సంరక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలను చేపట్టిన వెంటగాళ్లను అడ్డుకోలేకపోతుంది. ఒక అప్పుడు వేటగాళ్లు తుపాకీ, ఉచ్చులను ఉపయోగించి వన్యప్రాణులను వేటాడేవాళ్లు. కానీ ప్రస్తుతం వేటగాళ్ల రూటు మారింది.. ఓ జంతువును చంపడానికి మరో జంతువును ఉపయోగిస్తున్నారు. వేట కుక్కలను ఉపయోగించి వన్య ప్రాణులను వేటాడుతున్న కొందరు వేటగాళ్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తిరుపతిలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళ్తే.. వేట కుక్కలతో వణ్యప్రాణులను వేటాడుతున్నారు. చంద్రగిరి (మం)…
మధ్యప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. వేటగాళ్ల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మరణించిన విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ గుణ జిల్లాలోని సాగా బర్ఖెగా గ్రామంలో అటవీ ప్రాంతంలో ఘటన జరిగింది. శుక్రవారం రాత్రి కృష్ణజింకలను వేటాడుతున్నారనే పక్కా సమాచారంతో వేటగాళ్లను పట్టుకునేందుకు వెళ్లారు. ఈ సమయంలో వేటగాళ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సబ్ ఇన్ స్పక్టర్ రాజ్ కుమార్ జాతవ్, హెడ్ కానిస్టెబుల్ సంత్ రామ్ మీనా, కానిస్టేబుల్ నీరజ్ భార్గవ మరణించారు.…
ప్రభుత్వాలు ఎన్ని అటవీ, వన్యప్రాణుల సంరక్షణ చట్టాలను తీసుకువచ్చినా వన్యప్రాణులను వేటగాళ్ల భారీ నుంచి ఎవ్వరూ తప్పించలేకపోతున్నారు. ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా వేటగాళ్లు మాత్రం తమ దారిలోనే అధికారుల కళ్లు గప్పి గుట్టు చప్పుడు కాకుండా పని కానిచ్చేస్తున్నారు. దీంతో వన్యప్రాణుల సంరక్షణపై తీసుకునే రక్షణ చర్యలపై ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరముందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికే వేటగాళ్ల కారణంగా ఎన్నో వన్యప్రాణి జాతులు చివరి దశకు చేరుకున్నాయి. ఉన్న కొన్నింటినైనా కాపాడుకుని భవిష్యత్ తరాలకు వాటిని…