Tirumala: వన్య ప్రాణుల సంరక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలను చేపట్టిన వెంటగాళ్లను అడ్డుకోలేకపోతుంది. ఒక అప్పుడు వేటగాళ్లు తుపాకీ, ఉచ్చులను ఉపయోగించి వన్యప్రాణులను వేటాడేవాళ్లు. కానీ ప్రస్తుతం వేటగాళ్ల రూటు మారింది.. ఓ జంతువును చంపడానికి మరో జంతువును ఉపయోగిస్తున్నారు. వేట కుక్కలను ఉపయోగించి వన్య ప్రాణులను వేటాడుతున్న కొందరు వేటగాళ్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తిరుపతిలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళ్తే.. వేట కుక్కలతో వణ్యప్రాణులను వేటాడుతున్నారు. చంద్రగిరి (మం) పనపాకం ఫారెస్ట్ డివిజన్ లో ఘటన చోటు చేసుకుంది.
Read also:Irfan Pathan: ఇర్ఫాన్ పఠాన్ ఇంట్లో ఆఫ్ఘనిస్తాన్ టీమ్కు స్పెషల్ పార్టీ..
చంద్రగిరి (మం) పనపాకం ఫారెస్ట్ డివిజన్ లో కొంతకాలంగా ఈటలదడి, బొప్పిగుట్ట, వెదురుల కొండ, కందరవారి గుట్ట, మెరవగుట్ట, నచ్చు బండ, గుడిసె గుట్ట, దొంగల బండ, మాలవాడి చెరువు అటవీ ప్రాంతాల్లో విచ్చలవిడిగా వేటగాళ్లు వేట సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిఆర్వో చినబాబు ముగ్గురు వేటగాలను అదుపులోకి తీసుకుని.. రెండు వేట కుక్కలను, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితులు తమిళనాడుకు చెందిన సాయి, మంజులతో పాటు అరిగెలవారిపల్లెకు చెందిన మహేష్ గా గుర్తించారు. పట్టుబడిన నిందితులను అధికారులు విచారించగా.. అవి వేట కుక్కలు కాదని వాళ్ళ పెంపుడు కుక్కలని బుకాయించారు నిందితులు. కాగా అటవీ ప్రాంతంలో ఉన్న మరి కొన్ని వేట కుక్కలు కోసం రహస్యంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.