Kerala "Human Sacrifice" Accused Not CPM Members, Says Party:దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ ఇద్దరు మహిళల దారుణహత్య, నరబలి కేసులో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసు రాజకీయ రంగు పులుముకుంది. ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీలు నిందితులు అధికార సీపీఎం పార్టీకి చెందిన వారని ఆరోపణలు గుప్పిస్తున్నాయి. నరబలి కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురిలో ఇద్దరు సీపీఎం పార్టీలో క్రియాశీలక సభ్యులుగా ఉన్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.