నటుడు, దర్శకుడు అయిన రాకేష్ రోషన్ కుమారుడు హృతిక్ రోషన్ ప్రస్తుతం భారత్లోని సినీ వారసులలోనే అత్యంత సంపన్నుడుగా రికార్డులకు ఎక్కారు. హృతిక్ నికర ఆస్తి విలువ రూ.3100 కోట్లు అని తెలుస్తోంది. ఒక్కో చిత్రానికి రూ.85 కోట్లు పారితోషికం తీసుకునే ఈ నటుడికి HRX పేరిట క్రీడా దుస్తుల బ్రాండ్ ఉంది. దీని నుంచి అతను ఎక్కువ ఆర్జిస్తున్నారని సమాచారం. ఆ కంపెనీ విలువ రూ. 1000 కోట్లు అని ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ నివేదించింది. RK…
Hrithik Roshan: ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో, డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.
Kantara Movie: రిషబ్ శెట్టి నటించిన కన్నడ సినిమా ‘కాంతారా’కు అన్ని చోట్లా చక్కటి స్పందన లభించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 9న విడుదల కాగా అంతకు ముందే నవంబర్ 24న కన్నడ, తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయింది. థియేటర్లలో వీరతాండవం చేసిన ‘కాంతారా’కు ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో జననీరాజనం లభించింది. ఈ చిత్రాన్ని చూసిన హృతిక్ రోషన్ క్లైమాక్స్‌ని మెచ్చుకోవడమే కాదు గూస్‌బంప్స్…
దాదాపు రెండేళ్ళ క్రితం రూ. 1500 కోట్ల భారీ వ్యయంతో మూడు భాషల్లో, మూడు భాగాలుగా ‘రామాయణ’ చిత్రాన్ని నిర్మిస్తామని అల్లు అరవింద్, నితీష్ మల్హోత్ర, మధు మంతెన ప్రకటించారు. ఈ త్రీడీ మూవీని నితీశ్ తివారి, రవి ఉద్యావర్ దర్శకత్వం వహిస్తారని చెప్పారు. అప్పటి నుండీ ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉన్న ఈ సినిమాలో రాముడిగా ప్రిన్స్ మహేశ్ బాబు నటిస్తాడని, సీతగా దీపికా పదుకునే, రావణాసుడి పాత్రను హృతిక్ రోషన్ పోషిస్తారనే ప్రచారం జరిగింది.…
అమెజాన్ ప్రైమ్‌లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న మూవీ “సూరారై పొట్రు”. సూర్య హీరోగా, సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని హిందీలో రీమేక్ చేయనున్నారు. అయితే ఈ హిట్ రీమేక్ లో అక్కడ హీరోగా ఎవరు నటిస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆ జాబితాలో పలువురు స్టార్ హీరోల పేర్లు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్నటి వరకూ హిందీ రీమేక్ లో హృతిక్ రోషన్ నటించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఆ స్థానంలో…