నటుడు, దర్శకుడు అయిన రాకేష్ రోషన్ కుమారుడు హృతిక్ రోషన్ ప్రస్తుతం భారత్లోని సినీ వారసులలోనే అత్యంత సంపన్నుడుగా రికార్డులకు ఎక్కారు. హృతిక్ నికర ఆస్తి విలువ రూ.3100 కోట్లు అని తెలుస్తోంది. ఒక్కో చిత్రానికి రూ.85 కోట్లు పారితోషికం తీసుకునే ఈ నటుడికి HRX పేరిట క్రీడా దుస్తుల బ్రాండ్ ఉంది. దీని నుంచి అతను ఎక్కువ ఆర్జిస్తున్నారని సమాచారం. ఆ కంపెనీ విలువ రూ. 1000 కోట్లు అని ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ నివేదించింది.
RK Roja: హోంమంత్రిపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్..
హృతిక్ రోషన్ సినిమాల పరంగా సల్మాన్ ఖాన్ కంటే తక్కువ సంపాదిస్తూ ఉండవచ్చు. కానీ నెట్ వర్త్ విషయంలో మాత్రం దాటేశాడు. సంపన్న బాలీవుడ్ తారల గురించి చెప్పాలంటే షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ పేర్లు ముందుగా గుర్తు వస్తాయి. అయితే హృతిక్ నెట్‌వర్క్ దాదాపు రూ. 3100 కోట్లు అని తెలుస్తోంది. ఈ ఆదాయం ఆయన సినిమాల ద్వారా వచ్చిన మొత్తం కాదు, సినిమాలతో పాటు అద్భుతమైన వ్యాపారాల్లో ఆయన పెట్టిన పెట్టుబడి ఫలితమే. సల్మాన్ ఖాన్ నెట్ వర్త్ దాదాపు 2800 కోట్ల రూపాయలకు చేరువలో ఉంది. హృతిక్ రోషన్ తన కంపెనీ HRXతో సహా వ్యాపార పెట్టుబడుల ద్వారా అలాగే సినిమాల ద్వారా డబ్బు సంపాదిస్తాడు. ఇది కాకుండా తన తండ్రి నిర్మాణ సంస్థలో కూడా వాటా కలిగి ఉన్నాడు. హృతిక్ రోషన్ సినిమాలే కాకుండా వ్యాపారాలతో బాగానే సంపాదిస్తున్నాడు అందుకే ఇప్పుడు నెట్ వర్త్ విషయంలో టాప్ స్టార్స్ తో పోటీ పడుతున్నాడు.