Double Bedroom Scam: సంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని పేదలను నమ్మించి ఓ వ్యక్తి మోసం చేశాడు. అమీన్ పూర్ మండలం కిష్టారెడ్డిపేటకు చెందిన బీహెచ్ఈఎల్ ఉద్యోగి ప్రసన్న కుమార్ పై బాధితులు ఆరోపణలు చేస్తున్నారు.
డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు.. జస్ట్ 2 లక్షల రూపాయలు మాత్రమే..!! ఈ ఆఫర్ మీకు కూడా టెంప్టింగ్‌గా అనిపిస్తోంది కదూ..!! అవును మరి అలాంటిదే బంపర్ ఆఫర్..!! ఇలా నమ్మించే దాదాపు 100 మందిని బురిడీ కొట్టించారు నలుగురు కేటుగాళ్లు. ఏకంగా కోటి రూపాయలు కొట్టేసి నకిలీ పట్టాలు చేతిలో పెట్టారు. పోలీసులు పట్టుకోవడంతో ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నారు. సొంత ఇల్లు ఎవరికైనా ఓ కల. సొంత ఇల్లు ఉండాలి.. ఇది ఎవరికైనా ఓ కల..డబుల్ బెడ్‌రూమ్…
వల్లభనేని వంశీ రెండు రోజుల కస్టడీ పూర్తి అయింది.. బాపులపాడు నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో నమోదైన కేసుకి సంబంధించి వంశీని రెండ్రోజుల పాటు పోలీసులు విచారించారు. వంశీని 30కిపైగా ప్రశ్నలు అడిగారు. నకిలీ ఇళ్ల పట్టాలను ఎక్కడ ఎవరు ఎందుకు తయారు చేసారని వంశీని పోలీసులు ప్రశ్నించారు. నకిలీ ఇళ్ల పట్టాల తయారీలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే విషయాల్ని అడిగారు. తనకు నకిలీ పట్టాలతో సంబంధం లేదని వంశీ సమాధానం చెప్పారు.
Pre Launch Scam : హైదరాబాద్‌లో ప్రీ లాంచ్ మోసాల పరంపర ఆగట్లేదు. ఒకరిని చూసి మరొకరు ఉడాయిస్తున్నారో..! లేక టైమ్ చూసి బిచాణా ఎత్తేస్తున్నారో..! ప్రతీ వారం- పది రోజులకోక కంపెనీ మోసం బయటపడటం మాత్రం కలవరపెడుతోంది. సువర్ణభూమి, ఆర్జే గ్రూప్ చీటింగ్ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. ఇప్పుడు మరో సంస్థ బండారం బయటపడింది. ప్రీ లాంఛ్ ఆఫర్ పేరుతో బయ్యర్లను రోడ్డున పడేసింది ఎల్బీ నగర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న క్రితికా ఇన్‌ఫ్రా…
ప్రధాని నరేంద్ర మోడీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు.. పేదలందరికీ ఇళ్ల పట్టాల పథకం పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ స్కాంకు పాల్పడ్డారని ప్రధానికి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.. పేదలందరికీ భూమి పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందని.. ఈ స్కీం కింద భారీ ఎత్తున.. రూ. 35,141 కోట్ల మేర దోపిడీ జరిగిందన్నారు.