బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ జేబీఎస్ వద్ద నిరసనకు బండి సంజయ్ పిలుపు నిచ్చారు. దీనిలో భాగంగా జేబీఎస్ వద్ద నిరసన కార్యక్రమానికి బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లకుండా మందస్తుగా బండి సంజయ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ లోని ఆయన నివాసం వద్ద పోలీసులు చుట్టుముట్టి బండి సంజయ్ బయటకు రాకుండా అడ్డుకున్నారు.…
హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను గురువారం ఉదయం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్ర విభజనపై ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం టీఆర్ఎస్ కార్యకర్తలు చేపట్టిన నిరసనల్లో పలుచోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మోదీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జనగామలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ దాడులకు…
ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిన్న రాత్రి నుండి అటు అమరావతి, ఇటు పోలవరంకు వెళ్లనీయకుండా పశ్చిమ గోదావరిలోని టీడీపీ నేతలను ఎక్కడిక్కడ పోలీసులు గృహనిర్భంధం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నిమ్మల రామానాయుడి ఇంటి వద్ద పోలీసులను మోహరించారు. దీంతో టిడిపి శ్రేణులు భారీగా చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ… ఎ అంటే అమరావతి, పి అంటే పోలవరం గా ఏపీని నాడు చంద్రబాబు అభివృద్ధి…
వరి సాగుపై సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామా రెడ్డి ఇటీవల వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వరి వేస్తే ఉరేనని… వరి విత్తనాలు అమ్మితే… ఫర్టిలైజర్ షాపులపై చర్యలు తప్పవని సినిమా రేంజ్ లో వార్నింగ్ ఇచ్చారు సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామారెడ్డి. అయితే..కలెక్టర్ వెంకట్రామారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. అటు ప్రతి పక్ష కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలోనే… సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామారెడ్డి వ్యాఖ్యలకు…
కరోనా సెకండ్ వేవ్ తర్వాత భారతీయ సినిమా రంగంలో థియేట్రికల్ వ్యాపారం తిరిగి పుంజుకుంటున్న ఏకైక సినిమా పరిశ్రమ టాలీవుడ్. థియేటర్లు తిరిగి తెరిచినప్పటి నుండి ఎన్నో చిన్న సినిమాలు విడుదల అయ్యాయి. నెమ్మదిగా ప్రేక్షకులు కూడా థియేటర్లకు క్యూ కడుతున్నారు. ప్రతి వారం 5 సినిమాలకు తక్కువ కాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. రానురానూ చిన్న సినిమాలతో పాటుగా మీడియం బడ్జెట్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ శుక్రవారం (ఆగష్టు 27న) కూడా…
గత నెలాఖరులో సినిమా థియేటర్లను తెరచిన దగ్గర నుండి స్మాల్, మీడియం బడ్జెట్ చిత్రాలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ఇది సినిమాల విడుదలకు అచ్చి వచ్చే సీజన్ ఎంత మాత్రం కాదు. అయినా… సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో పెద్ద సినిమాలు వస్తే… తమకు చోటు దక్కదనే భయంతో చిన్న చిత్రాల నిర్మాతలంతా థియేటర్లకు క్యూ కడుతున్నారు. అలా జూలై చివరి వారం ఐదు సినిమాలు విడుదలైతే… ఈ నెల ప్రథమార్ధంలో ఏకంగా 15 సినిమాలు విడుదలయ్యాయి. ఇంతవరకూ ‘తిమ్మరుసు,…
ప్రముఖ కమెడియన్ శ్రీనివాసరెడ్డి ఇప్పుడు హీరోగానూ పలు చిత్రాలలో నటిస్తున్నాడు. మరికొన్ని సినిమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలే శ్రీనివాసరెడ్డి నటించిన ‘ముగ్గురు మొనగాళ్ళు’ చిత్రం విడుదలైంది. ‘ప్లాన్ బి’ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో అతను కీలక పాత్ర పోషించిన మరో సినిమా ‘హౌస్ అరెస్ట్’ ఈ నెల 27న విడుదల కాబోతోంది. సినిమా పంపిణీ రంగంలో ఉన్న కె. నిరంజన్ రెడ్డి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి, తొలియత్నంగా ‘హౌస్ అరెస్ట్’…
ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం కోకాపేటలోని భూములను వేలం వేసింది. ఈ వేలంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే కోకాపేటలో వేలం వేసిన భూములను సందర్శించాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. కోకాపేట భూములను సందర్శించి, ధర్నా చేయాలని పార్టీ నిర్ణయించారు. దీంతో జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. భూముల సందర్శనకు వెళ్లకుండా కాంగ్రెస్ నేతలు వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. Read:…
శ్రీకాకుళం జిల్లాలోని కోవిడ్ కేర్ ఆసుపత్రిని పరిశీలించేందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పిలుపునిచ్చారు. దీంతో టీడిపీ కార్యకర్తలు పాత్రుని వలసలోని కోవిడ్ కేర్ ఆసుపత్రుకి చేరుకున్నారు. ప్రస్తుతం కర్ఫ్యూ, 144 సెక్షన్ అమలులో ఉండటంతో పోలీసులు అనుమతించలేదు. పాత్రుని వలస వెళ్లకుండా టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. కూన రవికూమార్ బయటకు వెళ్లడానికి వీలులేదని, పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో కూన రవికుమర్ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.…