కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ నాయకుల సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య రాజకీయం ఒక్కసారిగా హిటెక్కింది. చెల్పూర్ హనుమాన్ ఆలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో నిరసనలు తెలుపుతున్న టీడీపీ నేతల గృహానిర్బంధం పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఆ పార్టీ నేతలను గృహనిర్బంధం చేయడంపై వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పిటిషన్ దాఖలు చేశారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రూరల్ పరిధిలోని గాంధీనగర్‌లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని కోరుతూ ఆయన నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
Telugu Desam Party: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ఇసుక, మద్యం, మారణాయుధాల సరఫరా, నకిలీనోట్లు, జిలెటిన్ స్టిక్స్ వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని ఉద్దేహాళ్ నుంచి తిమ్మలాపురం వరకు ఆయన ఆధ్వర్యంలో టీడీపీ నేతలు పాదయాత్ర…
Clashes in Macherla: పల్నాడు జిల్లా మాచర్ల అగ్నిగుండంలా మండిపోతోంది. వైసీపీ కార్యకర్తల విధ్వంసంతో మాచర్లలో హింస పేట్రేగింది. అధికార పార్టీ కార్యకర్తలను కంట్రోల్‌లో పెట్టాల్సిన పోలీసులు కూడా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై ప్రతాపం చూపుతున్నారు. ఇప్పటికే 144 సెక్షన్ విధించిన పోలీసులు టీడీపీ నేతలను గృహనిర్బంధంలో ఉంచారు. మరోవైపు గుంటూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబుతో పాటు టీడీపీ నేతలు నజీర్ అహ్మద్, కనపర్తి శ్రీనివాస్…
ఇవాళ టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య నాయకులు ఢిల్లీలోని తెలంగాణ భవన్ కు వెళ్లనున్నారు. అక్కడ నిరసన వ్యక్తం చేసేందుకు కాంగ్రెస్ ఎంపీలు, నాయకులు సిద్దమయ్యారు.
బాపట్ల జిల్లా రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అనగాని నివాసం వద్ద భారీగా పోలీసులను మొహరించారు. రేపల్లెలోని పోటుమెరక గ్రామంలో మద్యం సేవించి మరణించిన బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తామని శనివారం నాడు టీడీపీ ప్రకటించింది. మద్యం మరణాలపై టీడీపీ వేసిన నిజనిర్ధారణ కమిటీ బాధిత కటుంబాలను కలిసేందుకు సిద్ధమైంది. అయితే గ్రామంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ పార్టీల పర్యటనకు అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పారు. ఈ…
ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరులో వెంకాయమ్మ కుటుంబంపై వైసీపీ నేతలు పలు మార్లు దాడి చేశారని ఆరోపిస్తూ టీడీపీ నిరసనలు చేపట్టింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. వెంకాయమ్మ కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఒక కుటుంబంపై పదేపదే దాడులు జరుగుతుంటే అడ్డుకోలేకపోవడం పోలీసుల వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. బాధితురాలు వెంకాయమ్మతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని ఆమెకు…
బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘట్ కేసర్ టోల్ గేట్ సమీపంలో జిట్టాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న సంజయ్.. జూన్ 2న ‘‘అమరుల యాదిలో.. ఉద్యమ ఆకాంక్షల సాధన సభ’’ను జిట్టా నిర్వహించారని తెలిపారు. కేసీఆర్ ను కించపరిచే విధంగా ఆ సభలో స్కిట్ వేయించారని టీఆర్ఎస్ నేతల ఫిర్యాదుపై జిట్టాను పోలీసులు అరెస్ట్ చేశారు. జిట్టాను పోలీసులు అర్దరాత్రి అదుపులోకి తీసుకోవడంపై సంజయ్…