Germany: జర్మనీలోని హాంబర్గ్ విమానాశ్రయంలో గత 12 గంటల నుంచి తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో హఠాత్తుగా ఓ దుండగుడు కారుతో విమానాశ్రయంలోకరి చొరబడ్డాడు. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఎయిర్ పోర్టులోకి ప్రవేశించాడు, గన్ తో కాల్పులు జరపడమే కాకుండా, పెట్రోల్ బాంబులను విసిరాడు. అయితే గత 12 గంటలుగా దుండగుడితో చర్చించేందుకు హాంబర్గ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దుండగుడు తీసుకువచ్చిన కారులో అతనితో పాటు 4 ఏళ్ల అమ్మాయి కూడా ఉన్నారు.…