భారతదేశంలో హోలీ సంబరాలు మొదలైయ్యాయి.. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా, కుల మత భేదాలు లేకుండా అందరు కలిసి జరుపుకొనే పండుగ.. ఈ హోలీ పండుగను ఒక్కో ప్రాంతంలో జరుపుకుంటారు.. అయితే చాలా మందికి హోలీని ఎందుకు జరుపుకుంటారు అనే సంగతి గురించి తెలియదు. హోలీ పండుగ రోజుకు పెద్ద చరిత్ర ఉందని పండితులు చెబుతున్నారు.. మరి ఈ హోలీ పండుగను ఎందుకు జరుపుకుంటారో? ఎలా పూజ చేసుకోవాలో? ఇప్పుడు వివరంగా మనం తెలుసుకుందాం..
విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశ్యపుని చెడు ఆలోచనల నుండి విముక్తి పొందుతాడట.. ఇక హిరణ్యకశ్యపుని సోదరి హోలిక తన జ్వాలతో ప్రహ్లాదుని చంపడానికి వచ్చినపుడు ప్రహ్లాదుడును విష్ణుమూర్తి రక్షిస్తాడు.. ఆ మంటల్లో హోలీక కాలి బూడిద అవుతుంది.. అందుకే ఈ రోజున ప్రజలంతా రంగులతో సంబరాలు చేసుకుంటారు.. మార్చి నెలలో రంగుల పండుగ జరుపుకుంటారు. ఇది చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది.. అందుకే ప్రజలంతా తమ మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి సంబరాల్లో మునిగిపోతారు..
హోలీ రోజున పూజ చేస్తారు.. చెడును పారద్రోలి మంచికి స్వాగతం పలుకుతుందని ప్రజల నమ్మకం..హోలికా దహన పూజ చేసేందుకు చెక్క కుప్ప చుట్టూ పత్తి దారాన్ని మూడు లేదా ఏడు సార్లు చుట్టాలి. ఆ తర్వాత, దానిపై గంగాజలం, పువ్వులు, వెర్మిలియన్ చల్లుతారు. జపమాల, కుంకుమ, అక్షతే, బాతాశే, పసుపు, గులాబీ రంగు, కొబ్బరికాయలను ఉపయోగించి నిర్మిస్తారు.. దాన్ని ఎంతో పవిత్రంగా పూజిస్తారు..ఆ తర్వాత రంగులతో హోలీకి స్వాగతం పలుకుతారు.. అంతేకాదండోయ్.. నోటిని తీపి చేసుకునేందుకు ప్రత్యేక వంటలను కూడా చేసుకుంటారు.. మీరు కూడా చెడును, భాధలను వదిలేసి హోలీని జరుపుకోండి.. హోలీ శుభాకాంక్షలు..