Sky Walk: హైదరాబాద్ ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోడ్డు దాటడం అంటే సాహసించాల్సిందే. ఇప్పటికే ఎంతో మంది రోడ్డు దాటుతూ తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు.
Government Land Auction:ఆదాయం సమకూర్చునేందుకు అన్వేషణ మొదలు పెట్టింది తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం.. ఇందులో భాగంగా రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉన్న విలువైన భూములను వేలం వేసి ఆర్థిక వనరులను సమకూర్చునేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలో రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పలు ప్లాట్లను వేలం వేయాలని HMDA నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లాలోని పుప్పాలగూడ, గండిపేటలోని 366 సర్వే నెంబర్‌లో ఉన్న 41 వేల 971 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ప్లాట్లు విక్రయానికి…
ఇటీవల మీర్‌ఆలం ట్యాంక్‌లో మొసళ్లు, పాములు సంచరిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆ మీర్ ఆలం ట్యాంకులో మొసలి ప్రత్యక్షమైంది. పాత బస్తీలోని మీర్ ఆలం ట్యాంక్ చుట్టూ ఉన్న నెక్లెస్ రోడ్డును తెరవడంలో జాప్యం చేయడంతో ఆ ప్రాంతం పాములు, తేళ్లు, మొసళ్లకు నిలయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రోరైలు విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది హెచ్‌ఎండీఏ, హెచ్‌ఎంఆర్‌ఎల్‌లతో పాటు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (హెచ్‌ఏఎంఎల్) కూడా భాగస్వామ్యం కాబోతోంది.
క్రమంగా పెరిగిపోతున్న పెట్రో ధరలతో ప్రజలు ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తున్నారు.. అందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు.. ఎలక్ట్రిక్ బైక్‌లు, కార్లు సైతం హైదరాబాద్ రోడ్లపై దర్శనమిస్తున్నాయి.. అయితే, వాటిని సదరు వినియోగదారుడు ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది.. బయటకు వెళ్లే ఛార్జింగ్ సెంటర్లు పెద్దగా అందుబాటులో ఉన్న పరిస్థితి లేదు.. దీంతో ఎలక్ట్రిక్ వాహనదాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.. ఎక్కడికి వెళ్లినా.. ఛార్జింగ్ కిట్‌ను వెంట తీసుకెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసేవారు కూడా ఉన్నారు.. అంటే,…
హైదరాబాద్ నగరంలో రాజీవ్ స్వగృహ పథకంలో భాగంగా నిర్మించిన ఇళ్లపై హెచ్ఎండీఏ కీలక ప్రకటన చేసింది. రాజీవ్ స్వగృహ ఇళ్ల వేలానికి సంబంధించి హెచ్ఎండీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. బండ్లగూడ, నాగోల్‌లోని సహ భావన టౌన్‌షిప్ 15 టవర్‌లో మొత్తం 2246 ఇళ్లు అమ్మకానికి ఉన్నాయని తెలిపింది. వీటిలో చదరపు గజం కనీస ధర రూ. 2200 నుంచి రూ. 2700గా నిర్ణయించారు. అలాగే ఖమ్మం జిల్లా పోలేపల్లిలోని జలజ టౌన్ షిప్ 8 టవర్‌లో ఏకంగా…
రద్దీగా ఉండే ఉప్పల్ జంక్షన్‌లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్కైవాక్ మరో మూడు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న మెట్రో రైలు నిర్మాణంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) నిర్మిస్తున్న లూప్ ఆకారపు సదుపాయం రాజధాని నగరంలో మరో ప్రత్యేకమైన ఇంజనీరింగ్ అచీవ్‌మెంట్‌గా నిలుస్తుంది. పనులు శరవేగంగా జరుగుతున్నాయని మే 2022 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని హెచ్‌ఎండీఏ అధికారి తెలిపారు. “నిర్మాణం యొక్క స్తంభాలు వేయబడ్డాయి. డెక్ భాగం యొక్క 60…