హైదరాబాద్ నగర శివారులో మరో భారీ భూ వేలం పాటకు తెలంగాణ సర్కార్ సిద్ధం అయింది. మొకిలా ఫేజ్- 2 భూ వేలానికి హెచ్‌ఎండీఏ నేడ (సోమవారం) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రంగారెడ్డి జిల్లాలోని మొకిలా దగ్గర మూడు వందల పాట్ల అమ్మకానికి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
కోకాపేటలోని నియో పోలిస్ ఫేస్-2లోని భూములు హెచ్‌ఎండీఏకు కోట్లు కురిపించాయి. రికార్డు స్థాయిలో హైదరాబాద్ చరిత్రలోనే అత్యధికంగా ఎకరానికి రూ.100 కోట్లు ధర పలికింది.
కోకాపేటలోని నియో పోలిస్ ఫేజ్-2లో భూములు రికార్డు స్థాయిలో ధర పలికాయి. నియో పోలస్‌లో హెచ్‌ఎండీఏ ఎకరం భూమికి రూ.35 కోట్లుగా ధరను నిర్ణయించగా.. ఈ భూముల వేలంలో దిగ్గజ స్థిరాస్తి సంస్థలు పోటీపడ్డాయి.
ఉప్పల్ భగాయత్ లేఔట్ లో మిగిలి పోయిన 63 ప్లాట్లను వేలానికి హెచ్ఎండీఏ ( HMDA ) పెట్టింది. ఉప్పల్ భగాయత్ లో 464 గజాల నుండి 11,374 గజాల వరకు ప్లాట్లు ఉన్నాయి. జూన్ 27 వరకు రిజిస్ట్రేషన్ గడువు ఇచ్చింది హెచ్ఎండీఏ, 28 వరకు ఈఎండీ చెల్లించడానికి అవకాశం ఇచ్చింది.
Revanth Reddy: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) లీజుపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన నిరాధార ఆరోపణలను హైదరాబాద్ మహా నగర్ అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) సీరియస్‌గా తీసుకుంది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రేవంత్ రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగా అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ లీగల్ నోటీసులు జారీ చేసింది.
డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆ పరిసరాల్లోని పార్కులు, వినోద కేంద్రాలను ఆదివారం (30వ తేదీన) మూసివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ప్రకటించింది.
సీఎం కేసీఆర్ ఆదేశాలతో వరంగల్, నాందేడ్ నేషనల్ హైవే లపై రూ.18.61 కోట్ల వ్యయంతో పూలబాటలు పూర్తి చేసింది హెచ్ఎండిఏ. రూ.15.04 కోట్ల వ్యయంతో వరంగల్ హైవే (NH-163) వెంట 64 కిలోమీటర్లు, రూ.3.57 కోట్ల వ్యయంతో నాందేడ్ హైవే (NH-161) వెంట 33 కిలోమీటర్ల సెంట్రల్ మిడెన్ గ్రీనరీ, మల్టీ లేయర్ ప్లాంటేషన్ పనులు పూర్తి చేశారు.
HMDA: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) సమీపంలోని బాచుపల్లి లేఅవుట్ లో ప్లాట్లను కొనుగోలు చేసే అంశంపై ప్రజలను పక్కదారి పట్టిస్తున్న ఒక సంస్థ సీఈఓ పై హెచ్ఎండీఏ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు పై బాచుపల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.