విధుల్లో నిర్లక్ష్యంగా వున్న హెచ్ఎండిఎ అధికారులకు వెయ్యి పెనాల్టీ విధించింది ప్రభుత్వం. టీఎస్ బిపాస్ ఫైళ్ల పెండింగ్ కారణంగా పెనాల్టీ విధిస్తూ ఆదేశాలు జారీచేశారు మెట్రోపాలిటన్ కమిషనర్ అర్విoద్ కుమార్. టీఎస్ బిపాస్ చట్టానికి లోబడి ఫైళ్లను నిర్దేశించిన గడువు లోగా పరిష్కరించాలి. కానీ జాప్యం చేసిన నలుగురు అధికారులకు వెయ్యి రూపాయల చొప్పున నలుగురికి మెట్రోపాలిటన్ కమిషనర్ పెనాల్టీ విధించారు.
వారిలో హెచ్ఎండిఏలో పనిచేస్తున్న ముగ్గురు అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్స్(ఏపిఓ) సుధీర్ కుమార్, రమేష్ చరణ్, వసుంధరలతో పాటు తాహసిల్దార్ గజఫర్ హుస్సేన్ ఉన్నారు. వీరి వద్ద 16 రోజుల నుంచి 27 రోజుల వరకు ఫైలు పెండింగ్ లో ఉన్నట్టు కమిషనర్ అర్వింద్ కుమార్ గుర్తించారు. దీనిపై విచారించి ఇలాంటి పరిస్థితులు హెచ్ఎండిఏలో పునరావృతం కాకుండా ఉండాలన్న లక్ష్యంతో మొదటిసారిగా నామమాత్రపు పెనాల్టీ విధించారు.