Raghunandan Rao : దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు చిక్కుల్లో పడ్డారు. ఆయనకు ఐఆర్‌బీ సోమవారం లీగల్ నోటీసు పంపింది. వెయ్యి కోట్లకు రఘునందన్‌రావుకు ఐఆర్‌బీ నోటీసులు పంపింది. ఔటర్ రింగ్ రోడ్డును హెచ్‌ఎండీఏ ఐఆర్‌బీకి లీజుకు ఇచ్చింది. ఐఆర్‌బీకి ఔటర్ రింగ్ రోడ్డు లీజు కేటాయింపులో అవకతవకలు జరిగాయని మెదక్ ఎమ్మెల్యే రఘునందన్‌రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు. నిబంధనలకు విరుద్ధంగా ఐఆర్‌బీ కంపెనీకి 30 ఏళ్ల పాటు ఓఆర్‌ఆర్ లీజును ఇచ్చిందని రఘునందన్‌రావు ఆరోపించారు. ఈ నేపథ్యంలో రఘునందన్‌రావుకు ఓఆర్‌బీ లీగల్ నోటీసు పంపింది. వెయ్యి కోట్ల పరువు నష్టం దావా వేసింది.
Read Also:CM KCR: రాష్ట్ర అవతరణ ఉత్సవాల నిర్వహణపై కేసీఆర్ సమీక్ష
నిబంధనలకు విరుద్ధంగా ఓఆర్‌ఆర్‌ను 30 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నారని బీజేపీ ఆరోపించింది. ఇదే విషయాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా విమర్శించారు. రేవంత్ రెడ్డికి హెచ్‌ఎండీఏ లీగల్ నోటీసులు పంపింది. ఈ వ్యవహారంపై రెండు రోజుల క్రితం రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపింది. ఓఆర్ఆర్ లీజుపై కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. లీజు నిబంధనలను తుంగలో తొక్కారని ఆరోపించారు.
Read Also:Kerala: మటన్ తక్కువైందని జైలు అధికారులను కొట్టిన ఖైదీ..