`రెరా’ రిజిస్ట్రేషన్ పొందకుండా నిబంధనలు అతిక్రమించిన పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు షోకాజు నోటీసులు జారీ చేయడం జరుగుతుందని, 15 రోజుల లోగా సంజయిషి సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు రెరా అధికారులు. బిల్డాక్సు రియల్ ఎస్టేట్ కంపెనీ హఫీజ్ పేటలో ప్రీ-లాంచ్ కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి షోకాజ్ నోటీసు జారీ చేశారు అధికారులు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జింకల తoడాలో GRR విశ్రాంతి రిసార్ట్స్ `రెరా’ రిజిస్ట్రేషన్ పొందకుండా వ్యాపార ప్రకటనలు జారి చేసి…
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అందులో భాగంగానే బాలకృష్ణ కేస్ లో బినామీలకు ఏసీబీ నోటీసులు జారీ చేశారు. బీనామీలుగా ఉన్న భరత్, సత్యనారాయణ, భరణికి నోటీసులు అందించారు.
HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల వ్యవహారంపై ఏసీబీ దూకుడుగా వ్యవహరిస్తోంది. కస్టడీ విచారణ సమయంలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి పేరును శివబాలకృష్ణ చెప్పడంతో.. ఆయనను విచారించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. న్యాయ సలహాతో నోటీసులు జారీ చేసి విచారించడానికి సిద్ధమవుతోంది ఏసీబీ. 161 కింద నోటీసులు ఇచ్చి వివరాలు సేకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. బాలకృష్ణ దగ్గర దొరికిన ల్యాబ్‌టాప్, సెల్‌ఫోన్లు అనాలసిస్ చేస్తున్న ఏసీబీ.. శివ బాలకృష్ణ, ఐఏఎస్ అరవింద్‌ల…
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రేరా కార్యదర్శి శివబాలకృష్ణను 8వ రోజు ఏసీబీ అధికారులు విచారించారు. నేటి శివ బాలకృష్ణ ఏసీబీ కస్టడీ విచారణ ముగిసింది. దీంతో శివ బాలకృష్ణ ను ఏసీపీ కోర్టులో ఏసీబీ అధికారులు హాజరుపరిచారు. చివరి రోజున 5గంటలు శివ బాలకృష్ణ ప్రశ్నించింది ఏసీబీ బృందం. శివ బాలకృష్ణ మేనల్లుడు భరత్ ను సైతం బినామీగా గుర్తించింది ఏసీబీ. ఇప్పటికే ఈ కేసులో బాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ ను అరెస్ట్…
HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. శివ బాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ అరెస్టు ఎసీబీ అధికారులు. మూడు రోజులపాటు నవీన్ కుమార్ విచారించిన తరువాత ఏసీబీ ఆయనను అరెస్టు చేసింది. నవీన్ కుమార్ బినామీగా ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ, బాలకృష్ణకు బినామీగా ఉండి ఆస్తులను కూడబెట్టినట్టు గుర్తించారు. ఇప్పటికే శివ బాలకృష్ణ ను ఎనిమిది రోజుల కస్టడీలో భాగంగా ప్రశ్నిస్తోంది ఏసీబీ బృందం. ఇప్పడు ఆయన సోదరుడిని…
ఆదాయానికి మించిన అక్రమ ఆస్తుల కేసులో HMDA మాజీ డైరెక్టర్ ఏసీబీ కస్టడీ విచారణ ఏడవరోజు ముగిసింది. 6గంటల పాటు శివ బాలకృష్ణ అక్రమ ఆస్తులపై ఏసీబీ అధికారులు విచారించారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలకృష్ణతో పాటు.. ఆదిత్య అండ్ ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రతినిధులను విచారించారు. అక్రమ ఆస్తులు, బినామీలపై ఏసీబీ ఆరా తీసింది. శివ బాలకృష్ణ సోదరుడు శివ సునీల్, మేనల్లుడు భరత్ పేరు మీద భారీగా ఆస్తులు…
Hyderabad: హైదరాబాద్ మహానగరం గురించి అందరికీ తెలిసిందే. హైదరాబాద్‌కు ఎక్కడెక్కడి నుంచో ఉపాధి కోసం చాలా మంది వస్తుంటారు. అలాగే చాలా మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం వస్తుంటారు.
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. శివ బాలకృష్ణను ఎనిమిది రోజుల పాటు కస్టడికి అనుమతిస్తూ నిన్న ( మంగళవారం ) ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాళ్టి నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు కస్టడీలో విచారించనున్నారు.
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఆస్తులపై కొనసాగుతున్న విచారణ కొనసాగుతుంది. హెచ్ఎండీఏలో సంవత్సర కాలంగా బాలకృష్ణ అనుమతులపై విచారణ కొనసాగుతుంది. ఇక, బాలకృష్ణకు సహకరించిన అధికారుల పాత్రపై కూడా ఎంక్వైరీ కొనసాగుతుంది.