ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా పలు ప్రాంతాల్లో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలోని హిందూపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. హిందూపురం జిల్లా కోసం హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆయన మౌన దీక్ష చేపట్టనున్నారు. ముందుగా హిందూపురంలో భారీ ర్యాలీ నిర్వహించి.. ఆ తర్వాత బాలయ్య దీక్ష చేపట్టనున్నారు. Read Also: రాయలసీమను 14 జిల్లాలుగా విభజించాలి: బైరెడ్డి శుక్రవారం…
ఏపీలో కొత్త జిల్లాల విభజన సందర్భంగా పలుచోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. అందులో అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం కూడా ఉంది. పుట్టపర్తి కేంద్రంగా ప్రభుత్వం సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగా.. ఆ నిర్ణయాన్ని హిందూపురం నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ కనబడడం లేదంటూ స్థానిక బీజేపీ నాయకులు స్థానిక వన్‌టౌన్…
అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి దగ్గర మంగళవారం మధ్యాహ్నం ఉద్రిక్తత నెలకొంది. డంపింగ్ యార్డు వివాదం ఈ ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో టీడీపీ నేతలు, వైసీపీ నేతల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం చోటుచేసుకుంది. డంపింగ్ యార్డుపై టీడీపీ నేతలు సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టుకు స్పందించిన వైసీపీ కార్యకర్తలు బాలయ్య ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే వారిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరినొకరు తోసుకున్నారు.…
అనంతపురం జిల్లా హిందూపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా బెనిఫిట్ షో వేస్తామని చెప్పి బాలాజీ థియేటర్ యాజమాన్యం డబ్బులు వసూలు చేసిందని.. అయితే బెనిఫిట్ షో వేయలేదంటూ అభిమానులు ఆందోళనకు దిగారు. బాలాజీ థియేటర్ యాజమాన్యం బెనిఫిట్ షో కోసం ఒక్కొక్కరి నుంచి రూ. 500 వసూలు చేసిందని అభిమానులు ఆరోపించారు. ఈ మేరకు థియేటర్ వద్ద బోర్డు కూడా ఏర్పాటు చేశారని చెప్పారు. Read Also: దేశవ్యాప్తంగా రెండు…
అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం కలిగిస్తున్నాయి. హిందూపురం కొట్నూరు చెరువు మరువ వద్ద తృటిలో తప్పింది పెను ప్రమాదం.నీటిలో చిక్కుకుపోయింది తూముకుంట గార్మెంట్స్ కు వెళ్లే ప్రైవేటు బస్సు. నీటి ప్రవాహం భారీగా ఉన్నా రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు డ్రైవర్. బస్సులో దాదాపు 30 మంది మహిళలు వున్నారు. స్థానికుల సహాయంతో బయటపడ్డారు కార్మికులు. భారీ నీటి ప్రవాహం వున్నప్పుడు బస్సు డ్రైవర్లు అప్రమత్తంగా వుండాలని స్థానికులు సూచిస్తున్నారు. ప్రమాదం నుంచి బయటపడడంతో మహిళా…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్‌ను ఏక వచనం తో పిలుస్తూ వ్యక్తిగత విమర్శలు చేశారు. ప్రభుత్వ జీవోను కూడా నారా లోకేష్ పలకరాదన్నారు. జీవోను నారా లోకేష్ నోరు తిరకగ జీయో అని అంటాడని ఎద్దేవా చేశాడు. నారా లోకేష్ కు నోరు తిరగక పోతే ఇంట్లో కూర్చోవాలని అన్నాడు. అంతే కాకుండా నారా లోకేష్ తెలుగు రాకపోతే సరిగ్గా…
పవర్లూమ్స్ హ్యాండ్లూమ్స్ మగ్గాల యజమానులు నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో విజిలెన్స్ అధికారులు అనంతపురంలో దాడులు నిర్వహించడం చర్చనీయాంశం అయింది. అయితే ఈ దాడులు తూతూమంత్రంగా జరిగాయంటున్నారు. మగ్గాల యజమానులతో కుమ్మక్కై ఎలాంటి కేసు నమోదు చేయకుండా మూడురోజులపాటు విజిలెన్స్ దాడులు నిర్వహించారు. ఇలాంటి దాడులతో ఒరిగేదేం లేదంటున్నారు. మూడునాళ్ళ ముచ్చట అనే రీతిగా వ్యవహరించిన తీరు అనంతపురం జిల్లా హిందూపురం లో జరిగింది. అనంతపురం జిల్లా హిందూపురం పవర్లూమ్స్ యూనిట్ల పై ఎన్…
అనంతపురం : హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వాస్పత్రిలో సౌకర్యాలపై రోగులను అడిగి తెలుసుకున్న బాలకృష్ణ… వైద్యసేవలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ… సరైన వైద్యం అందట్లేదని రోగుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని… జిల్లా ప్రభుత్వాస్పత్రిలోనే ఇంత అధ్వానంగా పరిస్థితులు ఉన్నాయని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వ హాయంలో వ్తెద్య సేవల కోసం తెచ్చిన వ్తెద్య పరికరాలు వాడకుండా మూలన పడివేశారని మండిపడ్డారు బాలకృష్ణ. ప్రభుత్వాస్పత్రిలో పరిస్థితులపై జిల్లా…