మొక్కై వంగనిది మానై వంగుతుందా..? ప్రస్తుతం హిందూపురం వైసీపీలో పరిస్థితి అలాగే ఉంది. మూడేళ్ల క్రితం మొదలైన వర్గపోరు చినికి చినికి గాలి వాన కాదు.. పెద్ద తుఫానుగా మారిపోయింది. ఛాన్స్ దొరికితే చాలు కొట్టేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన మహ్మద్ ఇక్బాల్.. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనంటే నియోజకవర్గంలోని మరో వర్గానికి అస్సలు పడటం లేదు. ఇన్నాళ్లూ ఏదో ఒక రూపంలో అసమ్మతి తెలియజేసినా.. ప్రస్తుతం మాత్రం ఆ సెగలు రోడ్డెక్కడంతో…