Bangladesh: బంగ్లాదేశ్‌లో అరాచకం ఏ విధంగా రాజ్యమేలుతుందనే దానికి ఈ సంఘటన ఉదాహరణ. విద్యార్థి ఉద్యమం ముసుగులో హిందువులపై ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడ్డారు. గతేడాది షేక్ హసీనాను ప్రధాని పదవి నుంచి దించేందుకు కొనసాగిన ఈ హింసాత్మక సంఘటనల్లో అనేక మంది హిందువుల్ని హత్య చేయడంతో పాటు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు.