Amarnath Yatra: ఈ ఏడాది జమ్మూ కాశ్మీర్‌లో జరగనున్న పవిత్ర అమరనాథ్ యాత్రకు కేంద్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఈ నెల జూలై 3 నుంచి ఆగస్టు 9 వరకు కొనసాగనున్న 38 రోజుల యాత్రను 581 కేంద్ర సాయుధ పోలీసు (CAPF) బలగాలతో, జామర్లు, డ్రోన్లతో కాపాడనున్నారు. ఏప్రిల్ 22న పహల్గాం దాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందిన నేపథ్యంలో, ఈసారి యాత్రపై పూర్తి స్థాయి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.…
ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళా 2025 తర్వాత.. ఇప్పుడు అందరి కళ్ళు మరో కుంభమేళాపై ఉన్నాయి. ఈ కుంభమేళా దక్షిణ భారతదేశంలో జరుగుతుంది. తమిళనాడులోని కుంభకోణం పట్టణంలో 'మహామహం' (కుంభమేళా) నిర్వహిస్తారు. ఈ 'మహామహం'లో కూడా దేశం నలుమూలల నుంచి దాదాపు కోటి మంది భక్తులు పవిత్రమైన అమృత స్నానానికి వస్తారు. ఈ కుంభమేళా కూడా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. 'మహామహం' సందర్భంగా.. "అఖిల భారత సన్యాసి సంఘం" నిర్వహించిన 'మాసి మహాపెరువిల- 2025' కార్యక్రమానికి…