Amarnath Yatra: ఈ ఏడాది జమ్మూ కాశ్మీర్‌లో జరగనున్న పవిత్ర అమరనాథ్ యాత్రకు కేంద్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఈ నెల జూలై 3 నుంచి ఆగస్టు 9 వరకు కొనసాగనున్న 38 రోజుల యాత్రను 581 కేంద్ర సాయుధ పోలీసు (CAPF) బలగాలతో, జామర్లు, డ్రోన్లతో కాపాడనున్నారు. ఏప్రిల్ 22న పహల్గాం దాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందిన నేపథ్యంలో, ఈసారి యాత్రపై పూర్తి స్థాయి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. యాత్ర మార్గాల్లో రోడ్ ఓపెనింగ్ పార్టీలు (ROPs), క్విక్ యాక్షన్ టీమ్స్ (QATs), బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్ (BDS), కె9 డాగ్ యూనిట్లు, డ్రోన్లు సైతం పనిచేయనున్నాయి.
Read Also: RCB Stampede: తొక్కిసలాట ఘటన.. ఆర్సీబీ యాజమాన్యంపై కేసు నమోదు..
అయితే ఈసారి తొలిసారిగా జామర్లు అమర్చనున్నారు. వీటి ద్వారా యాత్ర ర్యాలీ కదలికల సమయంలో ఎలాంటి సాంకేతిక వాహన దాడులు జరగకుండా ముందస్తుగా నివారిస్తారు. CAPF బలగాలు యాత్రకు తగిన రక్షణను కల్పించనున్నాయి. యాత్రలో పాల్గొనే భక్తుల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసేందుకు జాతీయ రహదారులను తాత్కాలికంగా మూసివేయనున్నారు. భద్రత, శాంతి భద్రతల సమన్వయంతో యాత్ర నిర్వహణకు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి.
Read Also: MPs Suspend: హాకా నిరసన.. పార్లమెంటు నుంచి ముగ్గురు ఎంపీలు సస్పెండ్..!
అమరనాథ్ శ్రైన్ బోర్డు, జమ్మూ కాశ్మీర్ డివిజనల్ అడ్మినిస్ట్రేషన్, J&K పోలీస్, ఇతర సెక్యూరిటీ ఏజెన్సీలు కలిసి భద్రత, లాజిస్టిక్స్, యాత్ర నిర్వాహణపై సమీక్షలు నిర్వహిస్తున్నాయి. సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ గ్యానేంద్ర ప్రతాప్ సింగ్ స్వయంగా పహల్గాం, జమ్మూ, బేస్ క్యాంపులు, యాత్రి నివాస్‌లను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు భద్రతతో పాటు, అనుకూల వాతావరణం కల్పించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు.
హిందువుల పవిత్ర అమరనాథ్ యాత్ర జమ్మూ కాశ్మీర్ హిమాలయాల్లో 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న గుహ వద్దకు జరిగే యాత్ర. ఇందులో సహజంగా ఏర్పడే ఐస్ శివలింగంని దర్శించుకునేందుకు లక్షలాది భక్తులు విచ్చేస్తారు. శ్రావణ మాసంలో (జూలై-ఆగస్టు) ఈ యాత్ర నిర్వహించబడుతుంది. ఈ సంవత్సరం యాత్ర 52 రోజుల యాత్రను కుదించి 38 రోజులకు పరిమితం చేశారు. దీనివల్ల యాత్ర మరింత సమర్థంగా నిర్వహించేలా లక్ష్యంగా పెట్టుకున్నారు.