తమిళనాడులోని హొసూరులో పుష్ప వినాయకుడు విగ్రహంపై తీవ్ర వివాదం చెలరేగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని హిందూ సంఘాలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హొసూరులో వినాయక చవితిని పురస్కరించుకుని ప్రజలు ఒక భారీ సెట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సినీ నటుడు అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాలోని గెటప్‌లో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విగ్రహంలో వినాయకుడు ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేసే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. దీంతో ఇది తీవ్ర చర్చకు దారితీసింది. Also…
మహారాష్ట్ర ఎస్పీ అధ్యక్షుడు అబూ అజ్మీ.. మొఘల్ చక్రవరి ఔరంగజేబ్ గొప్ప పాలకుడని, క్రూరుడు కాదని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. వివాదం ముదరడంతో సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబు అజ్మి క్షమాపణ చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఇందువల్ల ఎవరి మనోభావాలైనా గాయపడి ఉంటే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు.
Vemulawada : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో అపచారం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు తమ పుట్టిన రోజులతో పాటు క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఆలయ పరిసరాల్లో ఉండే యాచకులకు, నిరాశ్రయులకు మాంసాహారంతో కూడిన ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. అయితే ఆలయ పరిసరాల్లోకి మాంసాహారం తీసుకు వెళ్ళొద్దనే నిబంధనలు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ప్రధాన ఆలయం సమీపంలోనికి వెళ్లి మాంసాహారంతో కూడిన ఆహారం పంపిణీ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. విషయం తెలుసుకున్న…
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి పట్టణంలో ఆక్రమిత స్థలంలో నిర్మించిన సంజౌలీ మసీదును కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్న నిరసనకారులపై పోలీసులు నిన్న (శుక్రవారం) నీటి ఫిరంగులతో పాటు లాఠీచార్జీ చేశారు. దీనికి నిరసనగా నేడు (శనివారం) రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి.