Bombay High Court: తన భర్త నుంచి విడిపోయిన ఒక మహిళ, తన అత్తమామలపై పెట్టిన క్రిమినల్ కేసును బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ కొట్టివేసింది. వివాహ వివాదాలు ప్రస్తుతం ట్రెండ్‌గా మారాయని, మహిళలను రక్షించడానికి ఉద్దేశించిన చట్టాలు దుర్వినియోగం చేసే ధోరణ పెరుగుతోందని కోర్టు గమనించింది. వివాహాలను రక్షించడానికి, వివాదాలను పరిష్కరించడానికి రూపొందించిన చట్టాలు తరుచుగా దుర్వినియోగం అవుతున్నాయని కోర్టు ప్రస్తావించింది.
Supreme Court: వైవాహిక వివాద కేసులో జీవిత భాగస్వామి టెలిఫోన్ సంభాషణల్ని రహస్యంగా రికార్డ్ చేయడం ఆమోదయోగ్యమైన సాక్ష్యమని సుప్రీంకోర్టు సోమవారం ఓ కేసులో తీర్పు చెప్పింది. జీవిత భాగస్వామి టెలిఫోన్ సంభాషణల్ని రహస్యంగా రికార్డు చేయడం గోప్యత హక్కును ఉల్లంఘిస్తుందని, కుటుంబ కోర్టులో సాక్ష్యంగా అంగీకరించలేమని పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పున సుప్రీంకోర్టు పక్కన పెట్టింది.
భర్త మరణానంతరం మరో వివాహం చేసుకున్న భార్యకు హిందూ వివాహ చట్టం ప్రకారం భర్త ఆస్తిలో వాటా పొందేందుకు హక్కు ఉంటుందని మద్రాసు హైకోర్టు తీర్పు ఇచ్చింది. తమిళనాడులోని సేలంకు చెందిన చిన్నయ్యన్ అనే వ్యక్తి మృతి చెందాక ఆయన భార్య మల్లిక రెండో పెళ్లి చేసుకున్నారు.
ఒక కేసును విచారిస్తున్నప్పుడు, హిందూ వివాహ చట్టం ప్రకారం వివాహం చేసుకోవడానికి 'కన్యాదానం' అవసరం లేదని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ వ్యాఖ్యానించింది. అశుతోష్ యాదవ్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. చట్టం ప్రకారం, కేవలం 'సప్తపది' (ఏడడుగులు) మాత్రమే హిందూ వివాహానికి అవసరమైన వేడుక అని పేర్కొంది.
Delhi High Court: భర్తను తన కుటుంబం నుంచి విడిగా జీవించాలని భార్య కోరడం క్రూరత్వానికి సమానమే అని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. వివాహం అనేది భవిష్యత్తు జీవితంతలో బాధ్యతలను పంచుకోవడమే అని, తన భార్య ఇంటి పనులు చేయాలని భర్త ఆదేశించడాన్ని క్రూరత్వంగా పేర్కొనలేమని కోర్టు చెప్పింది. పెళ్లయిన స్ట్రీని ఇంటి పని చేయమని కోరడం పనిలో సహాయం చేసినట్లు కాదని, ఇది ఆ కుటుంబం పట్ల ఆమెకున్న ప్రేమ, ఆప్యాయతగా పరిగణించబడుతుందని చెప్పింది. తన…
Delhi High Court: విడిపోయిన భార్యభర్తల నెలవారీ భరణానికి సంబంధించిన కేసును విచారిస్తూ ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సహేతుకమైన సంపాదించగల సామర్థ్యం ఉన్న జీవిత భాగస్వామి, తగిన వివరణ లేకుండా నిరుద్యోగిగా, పనిలేకుండా ఉండకూడదని, తన ఖర్చులను భర్త ఏకపక్షంగా భరించడానికి అనుమతించరాదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. హిందూ వివాహ చట్టం(హెచ్ఎంఏ) కింద విడిపోయిన భార్యకు భర్త చెల్లించాల్సిన నెలవారీ భరణాన్ని రూ.30,000 నుంచి 21,000లకి తగ్గిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
తన జీవిత భాగస్వామి మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారనే కారణంతో హిందూ వివాహ చట్టం, 1955 ప్రకారం ఏ వ్యక్తి విడాకులు కోరకూడదని బాంబే హైకోర్టు ఒక ముఖ్యమైన తీర్పులో పేర్కొంది.
భార్యను కొట్టే, హింసించే హక్కు భర్తకు ఏ చట్టం ఇవ్వలేదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. క్రూరత్వం, పురుషుడు విడిచిపెట్టడం వంటి కారణాలతో ఓ మహిళకు విడాకులు మంజూరు చేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
Delhi High Court: భార్య నుంచి తీవ్రమైన వేధింపులు ఎదుర్కొంటున్న భర్త కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అతను అప్లై చేసుకున్న విడాకులను కోర్టు సమర్థించింది. ప్రతీ వ్యక్తి కూడా గౌరవంగా జీవించడానికి అర్హులని..నిరంతర వేధింపులతో ఎవరూ జీవించకూడదని పేర్కొంది. భార్యతో విడిపోవడాన్ని సమర్థించింది. భార్య వేధింపులతో భర్త విడాకులు కోరాడు. ఈ కేసులో 2022 జూలైలో ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ భార్య ఢిల్లీ హైకోర్టులో అప్పీల్…